Title (Indic)దైవమా నీచేతిదే మా ధర్మపుణ్యము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా నీచేతిదే మా ధర్మపుణ్యము పూవువంటి కడు లేఁతబుద్ధివారము (॥దైవ॥) యేమిటివారము నేము యిదివో మాకర్మ మెంత భూమి నీవు పుట్టించఁగఁ బుట్టితిమి నేమముతో నడచేటి నేరుపేది మావల్ల దీముతో మోచిన తోలుదేహులము (॥దైవ॥) యెక్కడ మాకిఁక గతి యెరిఁగే దెన్నఁడు నేము చిక్కినట్టి నీ చేతిలో జీవులము తక్కక నీ మాయలెల్లఁ దాఁటఁగలమా మేము మొక్కలపుటజ్ఞానపు ముగ్ధలము (॥దైవ॥) యేది తుద మొదలు మాకిఁక నిందులో నీవే ఆదిమూర్తి నీకు శరణాగతులము యీదెస శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె నీదయ గలుగఁగాను నీ వారము English(||pallavi||) daivamā nīsedide mā dharmabuṇyamu pūvuvaṁṭi kaḍu lem̐tabuddhivāramu (||daiva||) yemiḍivāramu nemu yidivo māgarma mĕṁta bhūmi nīvu puṭṭiṁcham̐gam̐ buṭṭidimi nemamudo naḍaseḍi nerubedi māvalla dīmudo mosina toludehulamu (||daiva||) yĕkkaḍa māgim̐ka gadi yĕrim̐ge dĕnnam̐ḍu nemu sikkinaṭṭi nī sedilo jīvulamu takkaga nī māyalĕllam̐ dām̐ṭam̐galamā memu mŏkkalabuḍajñānabu mugdhalamu (||daiva||) yedi tuda mŏdalu māgim̐ka niṁdulo nīve ādimūrdi nīgu śharaṇāgadulamu yīdĕsa śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ nīdaya galugam̐gānu nī vāramu