Title (Indic)దైవమా నీ వెలితేది తమ వెలితేకాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవమా నీ వెలితేది తమ వెలితేకాని జీవుల(లు?) పట్టిన కొల్ల చేతిలోనే వున్నది (॥దైవ॥) నిండినవి జగముల నీ నామము లనంతము- లండఁ దలఁచేవార భాగ్యమే కాని పండియున్నదిదె దేవభక్తి యెందు చూచినాను దండితోడఁ బనిగొనే తమ నేర్పేకాని (॥దైవ॥) మనసులలో నున్నది మరి నీపై జ్ఞానము వొనరఁ దెలిసేవారి వోపికేకాని ఘనమైన మున్నిటి నీ కథలెల్లా నున్నవి విన నేరిచినవారి వివేకమే కాని (॥దైవ॥) శ్రీవేంకటేశ మీ ముద్ర చెల్లుబడై వున్నది వేవేగ ధరించేవారి వేడుకే కాని తావుకొని చేరువ నీదాస్యమిట్టే వున్నది భావించి నమ్మేటివారి పని యింతే కాని English(||pallavi||) daivamā nī vĕlidedi tama vĕlidegāni jīvula(lu?) paṭṭina kŏlla sedilone vunnadi (||daiva||) niṁḍinavi jagamula nī nāmamu lanaṁtamu- laṁḍam̐ dalam̐sevāra bhāgyame kāni paṁḍiyunnadidĕ devabhakti yĕṁdu sūsinānu daṁḍidoḍam̐ banigŏne tama nerbegāni (||daiva||) manasulalo nunnadi mari nībai jñānamu vŏnaram̐ dĕlisevāri vobigegāni ghanamaina munniḍi nī kathalĕllā nunnavi vina nerisinavāri vivegame kāni (||daiva||) śhrīveṁkaḍeśha mī mudra sĕllubaḍai vunnadi vevega dhariṁchevāri veḍuge kāni tāvugŏni seruva nīdāsyamiṭṭe vunnadi bhāviṁchi nammeḍivāri pani yiṁte kāni