Title (Indic)దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబట WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబట కావలసిన సౌఖ్యంబులు గలుగక మానీనా (॥దైవ॥) ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులు యెక్కడిజన్మము ప్రాణులకేలా కలిగినది యెక్కడిమోహవిడంబన యెక్కడియాశాబద్ధము యెక్కడికెక్కడ నిజమై యివి దానుండీనా (॥దైవ॥) యీకాంతలు నీద్రవ్యము లీకన్నులవెడయాసలు యీకోరికె లీతలఁపులు యిట్టే వుండీనా యీకాయం బస్థిరమన కీదుర్దశలకు లోనై యీకల్మషములఁ బొరలఁగ నివి గడతేరీనా (॥దైవ॥) దేవశిఖామణి తిరుమల దేవుని కృపగల చిత్తము పావనమై దురితంబులఁ బాయక మానీనా ఆవిభుకరుణారసమున నతఁడే తను మన్నించిన ఆవేడుక లీవేడుక లాసలు సేసీనా English(||pallavi||) daivakṛtaṁbaḍa sem̐taḍa tanagarmādhīnaṁbaḍa kāvalasina saukhyaṁbulu galugaga mānīnā (||daiva||) ĕkkaḍiduḥkhabaraṁpara lĕkkaḍisaṁsāraṁbulu yĕkkaḍijanmamu prāṇulagelā kaliginadi yĕkkaḍimohaviḍaṁbana yĕkkaḍiyāśhābaddhamu yĕkkaḍigĕkkaḍa nijamai yivi dānuṁḍīnā (||daiva||) yīgāṁtalu nīdravyamu līgannulavĕḍayāsalu yīgorigĕ līdalam̐pulu yiṭṭe vuṁḍīnā yīgāyaṁ basthiramana kīdurdaśhalagu lonai yīgalmaṣhamulam̐ bŏralam̐ga nivi gaḍaderīnā (||daiva||) devaśhikhāmaṇi tirumala devuni kṛpagala sittamu pāvanamai duridaṁbulam̐ bāyaga mānīnā āvibhugaruṇārasamuna nadam̐ḍe tanu manniṁchina āveḍuga līveḍuga lāsalu sesīnā