Title (Indic)దాసుల పాలిటి నిధానమై వున్నాఁ డదిగో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దాసుల పాలిటి నిధానమై వున్నాఁ డదిగో ఆసాబాసా నితఁడే అహోబలేశుఁడు (॥దాసు॥) నగె నదె వాఁడిగో నారసింహదేవుఁడు పగదీర హిరణ్యాక్షుఁ బట్టి చించి మృగరూపై గద్దెమీఁద మెఱసీవాఁ డదిగో అగవూఁ దగవెఱిఁగి యహోబలేశుఁడు (॥దాసు॥) తేరిచూచీ నదిగో దేవాదిదేవుఁడు ఘోరపు నెత్తురు గోళ్ళఁ గురియఁగాను నేరుపుతోఁ బేగుల జన్నిదాలవాఁ డదిగో ఆరితేరి కొలువున్నాఁ డహోబలేశుఁడు (॥దాసు॥) కరుణించీవాఁ డదిగో కమలాపతి దేవుఁడు సురలు గొలువఁగాను సొంపుతోడను యిరవై లోకములెల్లా నేలుచున్నాఁ డదిగో హరి శ్రీవేంకటాద్రియహోబలేశుఁడు English(||pallavi||) dāsula pāliḍi nidhānamai vunnām̐ ḍadigo āsābāsā nidam̐ḍe ahobaleśhum̐ḍu (||dāsu||) nagĕ nadĕ vām̐ḍigo nārasiṁhadevum̐ḍu pagadīra hiraṇyākṣhum̐ baṭṭi siṁchi mṛgarūbai gaddĕmīm̐da mĕṟasīvām̐ ḍadigo agavūm̐ dagavĕṟim̐gi yahobaleśhum̐ḍu (||dāsu||) terisūsī nadigo devādidevum̐ḍu ghorabu nĕtturu goḽḽam̐ guriyam̐gānu nerubudom̐ begula jannidālavām̐ ḍadigo ārideri kŏluvunnām̐ ḍahobaleśhum̐ḍu (||dāsu||) karuṇiṁchīvām̐ ḍadigo kamalābadi devum̐ḍu suralu gŏluvam̐gānu sŏṁpudoḍanu yiravai logamulĕllā nelusunnām̐ ḍadigo hari śhrīveṁkaḍādriyahobaleśhum̐ḍu