Title (Indic)దాసవర్గముల కెల్లా దరిదాపు మీరె కాన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దాసవర్గముల కెల్లా దరిదాపు మీరె కాన వాసికి నెక్కించరాదా వసుధలో మమ్మును (॥దాస॥) సేనాధిపతి నీవు చేరి విన్నవించరాదా శ్రీనాథునికి నేము సేసే విన్నపము ఆనుక భాష్యకారులు అట్టే మీరుఁ జేయరాదా మానక విన్నపము మా మనవి చనవులు (॥దాస॥) వేయినోళ్ల భోగి నీవు విన్నపము సేయరాదా వేయేసి మా విన్నపాలు విష్ణునికిని ఆయితమై గరుడఁడ అట్టే మీరుఁ జేయరాదా యేయెడ విన్నపము మా కేమి వలసినాను (॥దాస॥) దేవులమ్మ యిందిర మాదిక్కై విన్నవించరాదా శ్రీవేంకటపతికి చిత్తమందను ఆవేళ శేషాచలమ అట్టే మీరుఁ జేయరాదా యీవేళ మా విన్నపము లీడేరె నిఁకను English(||pallavi||) dāsavargamula kĕllā daridābu mīrĕ kāna vāsigi nĕkkiṁcharādā vasudhalo mammunu (||dāsa||) senādhibadi nīvu seri vinnaviṁcharādā śhrīnāthunigi nemu sese vinnabamu ānuga bhāṣhyagārulu aṭṭe mīrum̐ jeyarādā mānaga vinnabamu mā manavi sanavulu (||dāsa||) veyinoḽla bhogi nīvu vinnabamu seyarādā veyesi mā vinnabālu viṣhṇunigini āyidamai garuḍam̐ḍa aṭṭe mīrum̐ jeyarādā yeyĕḍa vinnabamu mā kemi valasinānu (||dāsa||) devulamma yiṁdira mādikkai vinnaviṁcharādā śhrīveṁkaḍabadigi sittamaṁdanu āveḽa śheṣhāsalama aṭṭe mīrum̐ jeyarādā yīveḽa mā vinnabamu līḍerĕ nim̐kanu