Title (Indic)దానికిఁ గల గుణము తప్ప దెంతయిన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దానికిఁ గల గుణము తప్ప దెంతయిన పూనిన నిర్విషమే పో హరినామము (॥దానికి॥) మాయవిషయపు నంజు మనుజుల నెల్లాను యేయెడ ధర్మాధర్మ మెఱుఁగనీదు కాయపు నిద్రయు ముంచు కన్నులునుఁ దెరపించు బాయట బహులీలలై భ్రమియింపించును (॥దానికి॥) యింద్రియభూతశివము యిందరి మేనును సోఁకి మంద్రపు సంసారమున మాల్లాడిపించు అంద్రించి కామాదులు యంకణాలాడింపించు తంద్ర నహంకారమున తన్నుఁగాన నియ్యఁడు (॥దానికి॥) యౌవనపు వెఱ్ఱి వట్టి అందరుసతులతోఁడ నవ్వి నవ్వి యాసలను నటింపించు యివ్వల శ్రీ వేంకటేశుఁ డిన్నిటా మాకుఁ గలఁడు రవ్వల నాతఁడే మమ్ము రక్షించు నెపుడు English(||pallavi||) dānigim̐ gala guṇamu tappa dĕṁtayina pūnina nirviṣhame po harināmamu (||dānigi||) māyaviṣhayabu naṁju manujula nĕllānu yeyĕḍa dharmādharma mĕṟum̐ganīdu kāyabu nidrayu muṁchu kannulunum̐ dĕrabiṁchu bāyaḍa bahulīlalai bhramiyiṁpiṁchunu (||dānigi||) yiṁdriyabhūdaśhivamu yiṁdari menunu som̐ki maṁdrabu saṁsāramuna māllāḍibiṁchu aṁdriṁchi kāmādulu yaṁkaṇālāḍiṁpiṁchu taṁdra nahaṁkāramuna tannum̐gāna niyyam̐ḍu (||dānigi||) yauvanabu vĕṭri vaṭṭi aṁdarusaduladom̐ḍa navvi navvi yāsalanu naḍiṁpiṁchu yivvala śhrī veṁkaḍeśhum̐ ḍinniḍā māgum̐ galam̐ḍu ravvala nādam̐ḍe mammu rakṣhiṁchu nĕbuḍu