Title (Indic)దానికేమి యిప్పుడేమి తప్పిపోయీనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దానికేమి యిప్పుడేమి తప్పిపోయీనా పూని యెదురుకట్లనె వున్నాఁడుగా (॥దాని॥) అలసిన రతివేళ ఆడినట్టి యీమాటలు తలఁచుకొమ్మనమో తనుఁ దానె పిలిపించి నాతోఁ దాను పెనఁగిన పెనఁగులు తెలిపే లేవె యింకా తెరమరఁగుననె (॥దాని॥) చిడుముడి మంచముపై చెనకిన చెనకులు తడవి చూచుకొమ్మనవె తన మేననె వుడివోక తారుమారై వునిచిన వుంగరాలు తడఁబడీ వేళ్లను తానెరఁగఁడా (॥దాని॥) కొత్తగా నాకాఁగిటిలో కూడినట్టి కూటములు యెత్తి యిమ్మనవె యీవేళనె హత్తెను శ్రీ వెంకటేశుఁ డట్టె తానన్ను తత్తరపు దమకము తనివి నొందీనా English(||pallavi||) dānigemi yippuḍemi tappiboyīnā pūni yĕdurugaṭlanĕ vunnām̐ḍugā (||dāni||) alasina radiveḽa āḍinaṭṭi yīmāḍalu talam̐sugŏmmanamo tanum̐ dānĕ pilibiṁchi nādom̐ dānu pĕnam̐gina pĕnam̐gulu tĕlibe levĕ yiṁkā tĕramaram̐gunanĕ (||dāni||) siḍumuḍi maṁchamubai sĕnagina sĕnagulu taḍavi sūsugŏmmanavĕ tana menanĕ vuḍivoga tārumārai vunisina vuṁgarālu taḍam̐baḍī veḽlanu tānĕram̐gam̐ḍā (||dāni||) kŏttagā nāgām̐giḍilo kūḍinaṭṭi kūḍamulu yĕtti yimmanavĕ yīveḽanĕ hattĕnu śhrī vĕṁkaḍeśhum̐ ḍaṭṭĕ tānannu tattarabu damagamu tanivi nŏṁdīnā