Title (Indic)దానికేమి తప్పదింతా తానే నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దానికేమి తప్పదింతా తానే నేను కానుకలు పచరించ కాలమెల్లా వలెనా (॥దాని॥) మాటలే మూటలాయ మంతనములాడఁగాను యేఁటివే తనసుద్దులు యెందాఁకానే పాటించి తా మగఁడైన ఫలమిది చాలదా కూటమికిఁ గొసరఁగ కొలువులో వలెనా (॥దాని॥) చూపూలే రూపులాయ చూడఁగాఁ జూడఁగాను యేపునఁ దనయెమ్మెలు యెందాఁకానే చేపట్టి తాఁ బెండ్లాడేచేఁత యిదే చాలదా తీపులు పచరించను తెరలోనే వలెనా (॥దాని॥) నవ్వులే పువ్వులాయ నాపైఁ దనమోహమున యెవ్వరు నెరఁగనివా యెందాఁకానే రవ్వగాఁ గూడె శ్రీ వెంకటరాయఁడిది చాలదా వువ్విళ్ళూర సన్నసేయ వొద్దనిట్టే వలెనా English(||pallavi||) dānigemi tappadiṁtā tāne nenu kānugalu pasariṁcha kālamĕllā valĕnā (||dāni||) māḍale mūḍalāya maṁtanamulāḍam̐gānu yem̐ṭive tanasuddulu yĕṁdām̐kāne pāḍiṁchi tā magam̐ḍaina phalamidi sāladā kūḍamigim̐ gŏsaram̐ga kŏluvulo valĕnā (||dāni||) sūbūle rūbulāya sūḍam̐gām̐ jūḍam̐gānu yebunam̐ danayĕmmĕlu yĕṁdām̐kāne sebaṭṭi tām̐ bĕṁḍlāḍesem̐ta yide sāladā tībulu pasariṁchanu tĕralone valĕnā (||dāni||) navvule puvvulāya nābaim̐ danamohamuna yĕvvaru nĕram̐ganivā yĕṁdām̐kāne ravvagām̐ gūḍĕ śhrī vĕṁkaḍarāyam̐ḍidi sāladā vuvviḽḽūra sannaseya vŏddaniṭṭe valĕnā