Title (Indic)దానికేమి దోసమా తగులము లెంచుకొని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దానికేమి దోసమా తగులము లెంచుకొని తానకమై లోలోనే తప్పక మించితివి (॥దాని॥) యింతి నీతో బలిమా యెదురాడఁగలదా చెంతల నీవుండఁగాను చెయి వట్టెను పంతగాఁడవౌదువు పడఁతికంటాఁ దొల్లి దొంతరలైతే వలపులు తోయరాకున్నాఁడవు (॥దాని॥) కోపమింకఁ దగునా కోమలి చలాలదా కోపుల నీవు నవ్వఁగా గోరగీరెను తీపులు నేరుతువు దిక్కులెల్లానెరుఁగును పూఁపలు చన్నులుగాఁగా పొందులుసేసితివి (॥దాని॥) గుట్టు నీకుఁజేసునా గురుతులు వెట్టునా యిట్టె నీవుగూడఁగాను యెనసెఁగాక దిట్టువు నీవౌదువు తేఁకువ శ్రీ వెంకటేశ పట్టిన వ్రతముగాఁగా పైకొని మెచ్చితివి English(||pallavi||) dānigemi dosamā tagulamu lĕṁchugŏni tānagamai lolone tappaga miṁchidivi (||dāni||) yiṁti nīdo balimā yĕdurāḍam̐galadā sĕṁtala nīvuṁḍam̐gānu sĕyi vaṭṭĕnu paṁtagām̐ḍavauduvu paḍam̐tigaṁṭām̐ dŏlli dŏṁtaralaide valabulu toyarāgunnām̐ḍavu (||dāni||) kobamiṁkam̐ dagunā komali salāladā kobula nīvu navvam̐gā goragīrĕnu tībulu neruduvu dikkulĕllānĕrum̐gunu pūm̐palu sannulugām̐gā pŏṁdulusesidivi (||dāni||) guṭṭu nīgum̐jesunā gurudulu vĕṭṭunā yiṭṭĕ nīvugūḍam̐gānu yĕnasĕm̐gāga diṭṭuvu nīvauduvu tem̐kuva śhrī vĕṁkaḍeśha paṭṭina vradamugām̐gā paigŏni mĕchchidivi