Title (Indic)దానికేమి దోసమా తాను నేను నొకటయితే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దానికేమి దోసమా తాను నేను నొకటయితే మోనాననుండి చూచితే మొద లేరుపడదు (॥దాని॥) చలములేనివలపు సాదించవసమా అలయిక బెట్టనుచు నందురుగాక తెలిసినవారికే దిష్టమై వుండఁగాను కొలఁది వెట్టఁగఁ బోతే గురిగా దొకటియు (॥దాని॥) ననుపుగాని పొందు నవ్వించవసమా అనఁగి పెనఁగుమని యందురు గాక విన నేర్చినవారే పనిగొన నేర్తురు కినిసి మొక్కఁగఁబోతే కిందుపడు బనులు (॥దాని॥) గక్కనఁ గూడినమీఁద కాతరించవసమా అక్కరదీర వలెననెందురు గాక యిక్కువ శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁగూడితివి తక్కినవి దడవితే తడఁబడీ మనసు English(||pallavi||) dānigemi dosamā tānu nenu nŏgaḍayide monānanuṁḍi sūside mŏda lerubaḍadu (||dāni||) salamulenivalabu sādiṁchavasamā alayiga bĕṭṭanusu naṁdurugāga tĕlisinavārige diṣhṭamai vuṁḍam̐gānu kŏlam̐di vĕṭṭam̐gam̐ bode gurigā dŏgaḍiyu (||dāni||) nanubugāni pŏṁdu navviṁchavasamā anam̐gi pĕnam̐gumani yaṁduru gāga vina nersinavāre panigŏna nerduru kinisi mŏkkam̐gam̐bode kiṁdubaḍu banulu (||dāni||) gakkanam̐ gūḍinamīm̐da kādariṁchavasamā akkaradīra valĕnanĕṁduru gāga yikkuva śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐gūḍidivi takkinavi daḍavide taḍam̐baḍī manasu