Title (Indic)దాని కేమి మీఁదటను దైవమే మేలు సేసీని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దాని కేమి మీఁదటను దైవమే మేలు సేసీని తానే యింత చేసునట తగులు వోయీనా (॥దాని॥) యింత మోహించిననేనె యింటికి రాఁ జెల్లుఁ గాక పంతగాఁడు తన కేలే పైకొనను కాంతుఁడు మ మ్మింత నేసి కట్టుకోనీ యామేలు యింతలోనే సతులకు హీన మయ్యీనా (॥దాని॥) మనసు లెంతైన నేనె మాటాడించ వలెఁ గాక తనిసితన కేలే తత్తరించను ఘనరాజసముతోఁ దా గడకూ బదుక నీవే వనితల కిందువంక వాసి దప్పీనా (॥దాని॥) కాఁకఁల బొందిన నేఁ గాఁగిలింతుఁ గాక మా వీఁకకు రాఁ దన కేలే వేడుకకాఁడు ఆఁకల శ్రీవెంకటేశుఁ డలమేలుమంగ నేను యేఁకటఁ గూడితి మిఁక నెఱ మయ్యీనా English(||pallavi||) dāni kemi mīm̐daḍanu daivame melu sesīni tāne yiṁta sesunaḍa tagulu voyīnā (||dāni||) yiṁta mohiṁchinanenĕ yiṁṭigi rām̐ jĕllum̐ gāga paṁtagām̐ḍu tana kele paigŏnanu kāṁtum̐ḍu ma mmiṁta nesi kaṭṭugonī yāmelu yiṁtalone sadulagu hīna mayyīnā (||dāni||) manasu lĕṁtaina nenĕ māḍāḍiṁcha valĕm̐ gāga tanisidana kele tattariṁchanu ghanarājasamudom̐ dā gaḍagū baduga nīve vanidala kiṁduvaṁka vāsi dappīnā (||dāni||) kām̐kam̐la bŏṁdina nem̐ gām̐giliṁtum̐ gāga mā vīm̐kagu rām̐ dana kele veḍugagām̐ḍu ām̐kala śhrīvĕṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu yem̐kaḍam̐ gūḍidi mim̐ka nĕṟa mayyīnā