Title (Indic)దాఁటలేను యీ మాయ దైవమా నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దాఁటలేను యీ మాయ దైవమా నేను నీటునఁ జేసేవాఁడవు నీవే నీవే కా (॥దాఁట॥) యీ మురికిదేహమే కా యెంతకాలమైన నేను వోముకొని భూమిమీఁద నుండఁ గోరేది దోమటి యింద్రియాలే నా తోడునీడై యుండి నన్ను వేమరు బోగించఁ జేసే వేనుబామైనది (॥దాఁట॥) పొంచి నాకర్మము లేకా పుట్టించి పుట్టించి పంచల నా జన్మములపాలు సేసేది అంచల యీ చిత్తమెకా ఆసలాసలఁ జిక్కి సంచితమై నా కీ పొద్దు చనివరి యైనది (॥దాఁట॥) చుట్టుకొన్న సంపదేకా సూదియై నానాఁటికి జట్టిగొని లోలోనే చవి సేసేది అట్టే శ్రీ వేంకటేశ అంతరంగాన నీవెకా పట్టు గొమ్మవై యుండఁగ బదికితి నేను English(||pallavi||) dām̐ṭalenu yī māya daivamā nenu nīḍunam̐ jesevām̐ḍavu nīve nīve kā (||dām̐ṭa||) yī murigidehame kā yĕṁtagālamaina nenu vomugŏni bhūmimīm̐da nuṁḍam̐ goredi domaḍi yiṁdriyāle nā toḍunīḍai yuṁḍi nannu vemaru bogiṁcham̐ jese venubāmainadi (||dām̐ṭa||) pŏṁchi nāgarmamu legā puṭṭiṁchi puṭṭiṁchi paṁchala nā janmamulabālu sesedi aṁchala yī sittamĕgā āsalāsalam̐ jikki saṁchidamai nā kī pŏddu sanivari yainadi (||dām̐ṭa||) suṭṭugŏnna saṁpadegā sūdiyai nānām̐ṭigi jaṭṭigŏni lolone savi sesedi aṭṭe śhrī veṁkaḍeśha aṁtaraṁgāna nīvĕgā paṭṭu gŏmmavai yuṁḍam̐ga badigidi nenu