Title (Indic)బుద్ది నేము చెప్పేమా పూఁటఁపూటకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బుద్ది నేము చెప్పేమా పూఁటఁపూటకు గద్దరీఁడు తానె యెరఁగవలెఁ గాక (॥బుద్ది॥) వెగటుగ నేమంతేసి విన్నవించవలెనా తగవెరిఁనవాఁడు తాఁ గాక మగువ లేమాడినాను మచ్చరించఁదగునా నగవు సేసుక పై కొనఁగవలెఁ గాక (॥బుద్ది॥) భ్రమయించి మాగుట్టు పచరించవలెనా తమకపడేటివాఁడు తాఁగాఁడా రమణులకు కూరిములు రచ్చఁబెట్టవలెనా సమ రతులకుఁ జేయి చాఁచవలెఁ గాక (॥బుద్ది॥) చెక్కునొక్కి నేమిఁకఁ జెనకఁగవలెనా దక్కగొని నన్నుఁగూడి తానెరఁగఁడా చిక్కి శ్రీ వెంకటేశుఁడు సెలవి నవ్వవలెనా మిక్కిలి రతులఁజొక్కి మేలమాడుఁ గాక English(||pallavi||) buddi nemu sĕppemā pūm̐ṭam̐pūḍagu gaddarīm̐ḍu tānĕ yĕram̐gavalĕm̐ gāga (||buddi||) vĕgaḍuga nemaṁtesi vinnaviṁchavalĕnā tagavĕrim̐navām̐ḍu tām̐ gāga maguva lemāḍinānu machchariṁcham̐dagunā nagavu sesuga pai kŏnam̐gavalĕm̐ gāga (||buddi||) bhramayiṁchi māguṭṭu pasariṁchavalĕnā tamagabaḍeḍivām̐ḍu tām̐gām̐ḍā ramaṇulagu kūrimulu rachcham̐bĕṭṭavalĕnā sama radulagum̐ jeyi sām̐savalĕm̐ gāga (||buddi||) sĕkkunŏkki nemim̐kam̐ jĕnagam̐gavalĕnā dakkagŏni nannum̐gūḍi tānĕram̐gam̐ḍā sikki śhrī vĕṁkaḍeśhum̐ḍu sĕlavi navvavalĕnā mikkili radulam̐jŏkki melamāḍum̐ gāga