Title (Indic)భూపతిచెరువుకాడ బొంచి తిరువేంకటేశుఁ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) భూపతిచెరువుకాడ బొంచి తిరువేంకటేశుఁ- డేపున నన్నెలయించి యెంత చేసెనే (॥భూప॥) యిట్టె సింగారించుకొని యింటికి నే రాఁగాను గుట్టుతోనె వచ్చి తా నాకొంగు వట్టెనే వొట్టువెట్టి నే దన్ను వొద్దనఁగానే పెఁడి- పట్టెమంచ మెక్కించుక పచ్చిచేసెనే (॥భూప॥) మలసి వెన్నెలలో మట్టెలమోతతోడ మెలఁగఁగా వచ్చి నాతో మేలమాడెనే చెలరేఁగి తప్పించుక సిగ్గుతో నే నుండఁగానే కులుకుగుబ్బలమీఁద గుఱుతులు నించెనే (॥భూప॥) మిన్నక ముసుఁగుతోడ మేడమీఁద నెక్కఁగానే సన్నచేసి నామోవి చవిగొనెనే కన్నుల నే వద్దనించి కలకల నవ్వఁగానే యిన్నిటా శ్రీవేంకటేశుఁ డిటు నన్నుఁ గూడెనే English(||pallavi||) bhūbadisĕruvugāḍa bŏṁchi tiruveṁkaḍeśhum̐- ḍebuna nannĕlayiṁchi yĕṁta sesĕne (||bhūba||) yiṭṭĕ siṁgāriṁchugŏni yiṁṭigi ne rām̐gānu guṭṭudonĕ vachchi tā nāgŏṁgu vaṭṭĕne vŏṭṭuvĕṭṭi ne dannu vŏddanam̐gāne pĕm̐ḍi- paṭṭĕmaṁcha mĕkkiṁchuga pachchisesĕne (||bhūba||) malasi vĕnnĕlalo maṭṭĕlamodadoḍa mĕlam̐gam̐gā vachchi nādo melamāḍĕne sĕlarem̐gi tappiṁchuga siggudo ne nuṁḍam̐gāne kulugugubbalamīm̐da guṟudulu niṁchĕne (||bhūba||) minnaga musum̐gudoḍa meḍamīm̐da nĕkkam̐gāne sannasesi nāmovi savigŏnĕne kannula ne vaddaniṁchi kalagala navvam̐gāne yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍiḍu nannum̐ gūḍĕne