Title (Indic)భావించ నేర్చినవారి భాగ్యముకొలది ముక్తి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) భావించ నేర్చినవారి భాగ్యముకొలది ముక్తి శ్రీవల్లభుఁడే జీవన్ముక్తి (॥భావించ॥) చూచి తలఁచేవారికి సులభాన నుండు ముక్తి కాచుకున్నవారికిఁ గలదు ముక్తి చేచేత నందుకొంటే చేరువనే వుండు ముక్తి యేచి కొలిచితేఁ దనయింట నుండు ముక్తి (॥భావించ॥) తగిలి సాము సేసితేఁ దనలో నున్నవి ముక్తి పగ లేకుండితే భూమిపై దే ముక్తి నొగులక నుడిగితే నోరనే వున్నది ముక్తి బగివాయకుండితే బట్టబయటనే ముక్తి (॥భావించ॥) ధరియించుకుండితేను తనువుపై నుండు ముక్తి అరసితే గురుస్మరణందుండు ముక్తి యిరవై శ్రీవేంకటేశు నెప్పుడు సేవించితేను దొరకి పుణ్యులకు నెదుట నుండు ముక్తి English(||pallavi||) bhāviṁcha nersinavāri bhāgyamugŏladi mukti śhrīvallabhum̐ḍe jīvanmukti (||bhāviṁcha||) sūsi talam̐sevārigi sulabhāna nuṁḍu mukti kāsugunnavārigim̐ galadu mukti seseda naṁdugŏṁṭe seruvane vuṁḍu mukti yesi kŏlisidem̐ danayiṁṭa nuṁḍu mukti (||bhāviṁcha||) tagili sāmu sesidem̐ danalo nunnavi mukti paga leguṁḍide bhūmibai de mukti nŏgulaga nuḍigide norane vunnadi mukti bagivāyaguṁḍide baṭṭabayaḍane mukti (||bhāviṁcha||) dhariyiṁchuguṁḍidenu tanuvubai nuṁḍu mukti araside gurusmaraṇaṁduṁḍu mukti yiravai śhrīveṁkaḍeśhu nĕppuḍu seviṁchidenu dŏragi puṇyulagu nĕduḍa nuṁḍu mukti