Title (Indic)బావంటాఁ జూడ వచ్చిన ఫల మాకెకుఁ గలిగె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బావంటాఁ జూడ వచ్చిన ఫల మాకెకుఁ గలిగె యీవలఁ జెలికత్తెల మే మనేము నిన్నును (॥బావ॥) తొడల సందికిఁ దీసి తొయ్యలిఁ బెనచుకొని జడియఁ బయ్యదకొంగు జారఁ దీసి వొడిసి కుచగిరుల నురమున నప్పళించి కడు నలయించితివి కటకటా చెలిని (॥బావ॥) కుమ్ముడి వట్టి వెనకకూను వంచి మొగమెత్తి చిమ్ముచును నొకచేతఁ జెక్కు నొక్కి తమ్ములము నోరిలోన తమకముతోఁ బెట్టి చిమ్మి రేఁచితి వింతేసి చెల్లఁబో చెలిని (॥బావ॥) వువిద కాఁగిట నించి వొత్తికిల పానుపుపై జవళిఁ గూడితివి పచ్చడము గప్పి యివల శ్రీవెంకటేశ యీకె యలమేలుమంగ తవిలి పెండ్లాడితివి తగునయ్యా చెలిని English(||pallavi||) bāvaṁṭām̐ jūḍa vachchina phala māgĕgum̐ galigĕ yīvalam̐ jĕligattĕla me manemu ninnunu (||bāva||) tŏḍala saṁdigim̐ dīsi tŏyyalim̐ bĕnasugŏni jaḍiyam̐ bayyadagŏṁgu jāram̐ dīsi vŏḍisi kusagirula nuramuna nappaḽiṁchi kaḍu nalayiṁchidivi kaḍagaḍā sĕlini (||bāva||) kummuḍi vaṭṭi vĕnagagūnu vaṁchi mŏgamĕtti simmusunu nŏgasedam̐ jĕkku nŏkki tammulamu norilona tamagamudom̐ bĕṭṭi simmi rem̐sidi viṁtesi sĕllam̐bo sĕlini (||bāva||) vuvida kām̐giḍa niṁchi vŏttigila pānububai javaḽim̐ gūḍidivi pachchaḍamu gappi yivala śhrīvĕṁkaḍeśha yīgĕ yalamelumaṁga tavili pĕṁḍlāḍidivi tagunayyā sĕlini