Title (Indic)బాలుఁ డటవే సాదటవే వీఁడు పల్లదీఁడు గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాలుఁ డటవే సాదటవే వీఁడు పల్లదీఁడు గాక కోలుముందై తనమాఁటలే గెలువ గొబ్బనఁ దగవు చెప్పీనమ్మా (॥బాలు॥) పసులఁ బేయలఁ గూరిచీనమ్మా పాలు నేయినారగించీనమ్మా పసిబిడ్డఁ డంటా నెట్టు నమ్మవచ్చు బాలకృష్ణురాయని కొసరి కన్నులు గీఁటినమ్మా కొంగువ ట్టొయ్యనె తీసీనమ్మా యిసుమంతలోనె కన్నుమొరఁగించి యిల్లిల్లు దప్పక తిరిగీనమ్మా (॥బాలు॥) నీరాటిరేవులఁ బొంచీనమ్మా నిక్కి నిక్కి తానెచూచీనమ్మా వేరులేక యెట్టు దగ్గరుదము గోవిందకృష్ణురాయని ఆరడితో నొడిదొడికీనమ్మా ఆనలువెట్టుచుఁ బోనీడమ్మా వీరిడిమాయల నిందరినిఁ దాసు వెంట వెంట నేల తిప్పీనమ్మా (॥బాలు॥) వొంటినె కాఁగిట నించీనమ్మా వొయ్యనె కళలు రేంచీనమ్మా నంటున మమ్మెల్లఁ గూడె శ్రీవెంకటనాథు కృష్ణరాయఁడు జంటవలపులు చల్లీనమ్మా చలమున దక్కగొనె నోయమ్మా బంటుగా నేలి అందరి మన్నించి పరిణామమున నున్నాఁ డమ్మా English(||pallavi||) bālum̐ ḍaḍave sādaḍave vīm̐ḍu palladīm̐ḍu gāga kolumuṁdai tanamām̐ṭale gĕluva gŏbbanam̐ dagavu sĕppīnammā (||bālu||) pasulam̐ beyalam̐ gūrisīnammā pālu neyināragiṁchīnammā pasibiḍḍam̐ ḍaṁṭā nĕṭṭu nammavachchu bālakṛṣhṇurāyani kŏsari kannulu gīm̐ṭinammā kŏṁguva ṭṭŏyyanĕ tīsīnammā yisumaṁtalonĕ kannumŏram̐giṁchi yillillu dappaga tirigīnammā (||bālu||) nīrāḍirevulam̐ bŏṁchīnammā nikki nikki tānĕsūsīnammā verulega yĕṭṭu daggarudamu goviṁdakṛṣhṇurāyani āraḍido nŏḍidŏḍigīnammā ānaluvĕṭṭusum̐ bonīḍammā vīriḍimāyala niṁdarinim̐ dāsu vĕṁṭa vĕṁṭa nela tippīnammā (||bālu||) vŏṁṭinĕ kām̐giḍa niṁchīnammā vŏyyanĕ kaḽalu reṁchīnammā naṁṭuna mammĕllam̐ gūḍĕ śhrīvĕṁkaḍanāthu kṛṣhṇarāyam̐ḍu jaṁṭavalabulu sallīnammā salamuna dakkagŏnĕ noyammā baṁṭugā neli aṁdari manniṁchi pariṇāmamuna nunnām̐ ḍammā