Title (Indic)బాలబొమ్మచారివి పట్టపువికారివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాలబొమ్మచారివి పట్టపువికారివి ఓలి నీ వెవ్వరిఁ గన్నా నూరకుండేవా (॥దొంగి॥) దొంగిలి వెన్నలుఁ బాలు దొడికేటినీచేయి ముంగిట నిధానమున్న మోసపోయీనా చెంగట నిన్నెవ్వరైనాఁ జెనకి నవ్విననూ అంగవించి కొనగోర నంటకుండేవా (॥దొంగి॥) సిగ్గరి గొల్లెతలపైఁ జిమ్మెడి నీ చూపు బగ్గన నిచ్చన చోటఁ బారవేసేవా దగ్గరి నిన్నెవ్వరైనాఁ దగులనాడిననూ ఎగ్గెఱుఁగ కెందుకైనా నేఁగకుండేవా (॥దొంగి॥) కొమ్మల చీరలు దీసుకొని యున్న నీవూ దిమ్మరి చేఁతల నిట్టె దిగఁ దోసేవా క్రమ్మర నావలెనె వేంకటగిరి విభుండా బిమ్మిటిగాఁ గూడి ప్రేమ పెంచకుండేవా English(||pallavi||) bālabŏmmasārivi paṭṭabuvigārivi oli nī vĕvvarim̐ gannā nūraguṁḍevā (||dŏṁgi||) dŏṁgili vĕnnalum̐ bālu dŏḍigeḍinīseyi muṁgiḍa nidhānamunna mosaboyīnā sĕṁgaḍa ninnĕvvarainām̐ jĕnagi navvinanū aṁgaviṁchi kŏnagora naṁṭaguṁḍevā (||dŏṁgi||) siggari gŏllĕdalabaim̐ jimmĕḍi nī sūbu baggana nichchana soḍam̐ bāravesevā daggari ninnĕvvarainām̐ dagulanāḍinanū ĕggĕṟum̐ga kĕṁdugainā nem̐gaguṁḍevā (||dŏṁgi||) kŏmmala sīralu dīsugŏni yunna nīvū dimmari sem̐tala niṭṭĕ digam̐ dosevā krammara nāvalĕnĕ veṁkaḍagiri vibhuṁḍā bimmiḍigām̐ gūḍi prema pĕṁchaguṁḍevā