Title (Indic)బాపు బాపు మెచ్చితిని పదవే నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపు బాపు మెచ్చితిని పదవే నీవు తీపులోనఁ జేఁదేల తెగకువే నీవు (॥॥) సెలవి నే నవ్వుటేడ చేరి నీ గొఱఁగు లేడ మెలఁకువ లెస్సాయ మేలే నీవు అలిగినదే లేదు అంతక తొల్లే మనము పిలిచితే బిగిసేది పెద్దరికమటవే (॥॥) పోందినేఁ జేయివేయుటెంత బొమ్మల నీజంకె నెంత అందు కందుకు లెస్సాయ నౌనే నీవు కందువై నమనలోనఁ గవట మించుక లేదు యిందరుఁ జూడఁగఁ గోప మేడనుండి వచ్చెనే (॥॥) కాఁగిట నేఁ గూడుటెట్టు కరఁగే వింతలో నెట్టు రాఁగె నిదివో వలపు రావే నీవు చేఁగదేరఁ గూడితిని శ్రీ వేంకటేశుఁడ నేను అఁగినరతుల నింత అలయఁగఁదగునా English(||pallavi||) bābu bābu mĕchchidini padave nīvu tībulonam̐ jem̐dela tĕgaguve nīvu (||||) sĕlavi ne navvuḍeḍa seri nī gŏṟam̐gu leḍa mĕlam̐kuva lĕssāya mele nīvu aliginade ledu aṁtaga tŏlle manamu piliside bigisedi pĕddarigamaḍave (||||) poṁdinem̐ jeyiveyuḍĕṁta bŏmmala nījaṁkĕ nĕṁta aṁdu kaṁdugu lĕssāya naune nīvu kaṁduvai namanalonam̐ gavaḍa miṁchuga ledu yiṁdarum̐ jūḍam̐gam̐ goba meḍanuṁḍi vachchĕne (||||) kām̐giḍa nem̐ gūḍuḍĕṭṭu karam̐ge viṁtalo nĕṭṭu rām̐gĕ nidivo valabu rāve nīvu sem̐gaderam̐ gūḍidini śhrī veṁkaḍeśhum̐ḍa nenu am̐ginaradula niṁta alayam̐gam̐dagunā