Title (Indic)అయ్యయ్యో భూమిమీఁద నన్నియుఁ గంటిఁ జెరువు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అయ్యయ్యో భూమిమీఁద నన్నియుఁ గంటిఁ జెరువు ముయ్య మూకు డడిగేటి మూఢులు గలరుగా (॥అయ్య॥) కడ నీ చెక్కుల గోళ్ల కాఁడినపో ట్లుండఁగ నొడిగే నా మాట నీకు నొప్పు లాయఁగా బడి బడి తల్లిదండ్రి పగ లుండఁగా లంజ గొడవలకుఁ బెనగే కూళలు గలరుగా (॥అయ్య॥) పెక్కు సతులు నీ మోవి పిప్పి నేసి వుండఁగాను యిక్కడ నే వగచుట హీన మాయఁగా మిక్కిలి రాళ్ల కోపక మెత్త నైనందు గుద్దలి యెక్కువ వాఁడి చేసేయెడ్డలు గలరుగా (॥అయ్య॥) తగనియెవ్వతో కాలితాఁకులు నీమై నుండఁగ బిగువు నా చన్నులొత్తు బిరు సాయఁగా అగపడి శ్రీవెంకటాధిప కూడితి విట్టె నగవు నిజాలు సేసేనాథులు గలరుగా English(||pallavi||) ayyayyo bhūmimīm̐da nanniyum̐ gaṁṭim̐ jĕruvu muyya mūgu ḍaḍigeḍi mūḍhulu galarugā (||ayya||) kaḍa nī sĕkkula goḽla kām̐ḍinabo ṭluṁḍam̐ga nŏḍige nā māḍa nīgu nŏppu lāyam̐gā baḍi baḍi tallidaṁḍri paga luṁḍam̐gā laṁja gŏḍavalagum̐ bĕnage kūḽalu galarugā (||ayya||) pĕkku sadulu nī movi pippi nesi vuṁḍam̐gānu yikkaḍa ne vagasuḍa hīna māyam̐gā mikkili rāḽla kobaga mĕtta nainaṁdu guddali yĕkkuva vām̐ḍi seseyĕḍḍalu galarugā (||ayya||) taganiyĕvvado kālidām̐kulu nīmai nuṁḍam̐ga biguvu nā sannulŏttu biru sāyam̐gā agabaḍi śhrīvĕṁkaḍādhiba kūḍidi viṭṭĕ nagavu nijālu sesenāthulu galarugā