Title (Indic)అయ్య జియ్యలు వెట్టే నీ యాఁడువారము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అయ్య జియ్యలు వెట్టే నీ యాఁడువారము పయ్యద కొంగునఁ గట్టేపాటివారమా (॥అయ్య॥) కాంతయాడాటాన కాఁకదేరినవాఁడవు చెంతల వలసించనేర్పినవాఁడవు దొంతిమోవుల దోమటిదొడికినవాఁడవు పంతాలు నీతో నాడేపాటివారమా (॥అయ్య॥) సరసపుమటాలనే సంతవెట్టిన వాఁడవు సరి నవ్వుఁగప్పురాలే చల్లేవాఁడవు తొరలింపుసిగ్గులకు దోసిలొగ్గినవాఁడవు పరగ నీకాళ్ళు దొక్కే పాటివారమా (॥అయ్య॥) కొలఁదిమీరినచనుఁగొండలలో వాఁడవు మెలుపు శ్రీవేంకటాద్రిమీఁదివాఁడవు అలమేల్మంగను నే నన్నలమినవాఁడవు కలసినరతులు పొగడే పాటివారమా English(||pallavi||) ayya jiyyalu vĕṭṭe nī yām̐ḍuvāramu payyada kŏṁgunam̐ gaṭṭebāḍivāramā (||ayya||) kāṁtayāḍāḍāna kām̐kaderinavām̐ḍavu sĕṁtala valasiṁchanerbinavām̐ḍavu dŏṁtimovula domaḍidŏḍiginavām̐ḍavu paṁtālu nīdo nāḍebāḍivāramā (||ayya||) sarasabumaḍālane saṁtavĕṭṭina vām̐ḍavu sari navvum̐gappurāle sallevām̐ḍavu tŏraliṁpusiggulagu dosilŏgginavām̐ḍavu paraga nīgāḽḽu dŏkke pāḍivāramā (||ayya||) kŏlam̐dimīrinasanum̐gŏṁḍalalo vām̐ḍavu mĕlubu śhrīveṁkaḍādrimīm̐divām̐ḍavu alamelmaṁganu ne nannalaminavām̐ḍavu kalasinaradulu pŏgaḍe pāḍivāramā