Title (Indic)ఔనే యిది జాణతన మందుకే నే మెచ్చితిని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఔనే యిది జాణతన మందుకే నే మెచ్చితిని నా నోరఁ బలికే నంటే నవ్వు వచ్చీఁ గాని (॥ఔనే॥) కానుకగాఁ దనకు నేఁ గప్పుర మంపితి నని ఆనవాలు చెప్పెంపే న న్నందు కేమే పూని తా వలచినట్టి పాలఁతి దోడి తెమ్మంటే దీనికే నే నియ్యకొని తేరాదు గాని (॥ఔనే॥) అడరి సొమ్ము లిద్దర మట్టె మార్చుకొంటి మని అడియాల మిచ్చి పంపీ నందు కేమే తడవి యేమైనాను తనకును నాపెకును యడ మిచ్చి పండఁ జోటియ్యరాదు గాని (॥ఔనే॥) రంగున నేఁ గూడినట్టి రహస్యపువేళ దన అంగపు గుఱుతు చూపినందు కేమే యింగితాన శ్రీవేంకటేశుఁ డాకె తనపొందు లంగవించి సాకిరైనా కనరాదు గాని English(||pallavi||) aune yidi jāṇadana maṁduge ne mĕchchidini nā noram̐ balige naṁṭe navvu vachchīm̐ gāni (||aune||) kānugagām̐ danagu nem̐ gappura maṁpidi nani ānavālu sĕppĕṁpe na nnaṁdu keme pūni tā valasinaṭṭi pālam̐ti doḍi tĕmmaṁṭe dīnige ne niyyagŏni terādu gāni (||aune||) aḍari sŏmmu liddara maṭṭĕ mārsugŏṁṭi mani aḍiyāla michchi paṁpī naṁdu keme taḍavi yemainānu tanagunu nābĕgunu yaḍa michchi paṁḍam̐ joḍiyyarādu gāni (||aune||) raṁguna nem̐ gūḍinaṭṭi rahasyabuveḽa dana aṁgabu guṟudu sūbinaṁdu keme yiṁgidāna śhrīveṁkaḍeśhum̐ ḍāgĕ tanabŏṁdu laṁgaviṁchi sāgirainā kanarādu gāni