Title (Indic)అప్పటి సుఖమేకాని యటమీఁదెంచుకొనఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అప్పటి సుఖమేకాని యటమీఁదెంచుకొనఁడు ఉప్పతిల్లు జీవుని వుద్యోగా లిట్టివి (॥అప్ప॥) తనుభోగపురతులు దలపోయుచుండుఁగాని తన నరకకూపాలు దలపోయఁడు కనకభూషణములు గని వెరగందుఁగాని ఘనకర్మబంధాలకుఁ గడు వెరగందఁడు (॥అప్ప॥) యీకడాకడఁదాఁ జేసేటియెమ్మెలే యెంచుఁగాని పైకొని కూడేటిపాపము లెంచఁడు దీకొని జగములోని ద్రిష్టములే చూచుఁగాని భీకరపు జన్మముల పిరివీకు చూడఁడు (॥అప్ప॥) వింతవింత మాటలవేడుకలే వినుఁగాని అంతటఁ దాఁ బడేపాట్లవి వినఁడు ఇంతటా శ్రీవేంకటేశుఁడేలఁగా నెరిఁగెఁగాని యెంతచెప్పినాను బుద్ధి యిన్నాళ్ళు నెరఁగఁడు English(||pallavi||) appaḍi sukhamegāni yaḍamīm̐dĕṁchugŏnam̐ḍu uppadillu jīvuni vudyogā liṭṭivi (||appa||) tanubhogaburadulu dalaboyusuṁḍum̐gāni tana naragagūbālu dalaboyam̐ḍu kanagabhūṣhaṇamulu gani vĕragaṁdum̐gāni ghanagarmabaṁdhālagum̐ gaḍu vĕragaṁdam̐ḍu (||appa||) yīgaḍāgaḍam̐dām̐ jeseḍiyĕmmĕle yĕṁchum̐gāni paigŏni kūḍeḍibābamu lĕṁcham̐ḍu dīgŏni jagamuloni driṣhṭamule sūsum̐gāni bhīgarabu janmamula pirivīgu sūḍam̐ḍu (||appa||) viṁtaviṁta māḍalaveḍugale vinum̐gāni aṁtaḍam̐ dām̐ baḍebāṭlavi vinam̐ḍu iṁtaḍā śhrīveṁkaḍeśhum̐ḍelam̐gā nĕrim̐gĕm̐gāni yĕṁtasĕppinānu buddhi yinnāḽḽu nĕram̐gam̐ḍu