Title (Indic)అన్ని విన్నపములును అందులోనే వున్నవి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అన్ని విన్నపములును అందులోనే వున్నవి వున్నతిఁ జెలికత్తెల మొద్దికతో నేము (॥అన్ని॥) ఆపెయంపినకానిక యవధరించితివా చూపులఁ దప్పక లెస్స చూచితివా చేపట్టి ముక్కునఁ దావి చిత్తగించితివా ఆపనుల కేమంటి నానతియ్యవయ్యా (॥అన్ని॥) యింతియంపినవారము యెఱుఁగుదువా మమ్ము చెంతల మావినయములు చెవి సోఁకెనా వింతలైనగురుతులు విచారించుకొంటివా అంతరంగానఁ బట్టెనా ఆనతియ్యవయ్యా (॥అన్ని॥) అలమేలు మంగ వచ్చె నండఁ బెట్టుకొంటివా వెలయఁ గాఁగిట గారవించితివా ఇల శ్రీవేంకటేశ్వర ఇన్నిటా జాణవు నీవు అలరే మాపనులెల్లా నానతియ్యవయ్యా English(||pallavi||) anni vinnabamulunu aṁdulone vunnavi vunnadim̐ jĕligattĕla mŏddigado nemu (||anni||) ābĕyaṁpinagāniga yavadhariṁchidivā sūbulam̐ dappaga lĕssa sūsidivā sebaṭṭi mukkunam̐ dāvi sittagiṁchidivā ābanula kemaṁṭi nānadiyyavayyā (||anni||) yiṁtiyaṁpinavāramu yĕṟum̐guduvā mammu sĕṁtala māvinayamulu sĕvi som̐kĕnā viṁtalainagurudulu visāriṁchugŏṁṭivā aṁtaraṁgānam̐ baṭṭĕnā ānadiyyavayyā (||anni||) alamelu maṁga vachchĕ naṁḍam̐ bĕṭṭugŏṁṭivā vĕlayam̐ gām̐giḍa gāraviṁchidivā ila śhrīveṁkaḍeśhvara inniḍā jāṇavu nīvu alare mābanulĕllā nānadiyyavayyā