Title (Indic)అనంతమహిముఁడవు అనంతశ క్తివి నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అనంతమహిముఁడవు అనంతశ క్తివి నీవు యెనలేని దైవమా నిన్నేమని నుతింతును (॥అనం॥) అన్నిలోకములు నీయందు నున్నవందురు నీ- వున్నలోక మిట్టిదని వూహించరాదు యెన్న నీవు రక్షకుఁడ విందరిపాలిటికి నిన్ను రక్షించేటివారి నేనెవ్వరి నందును (॥అనం॥) తల్లివి దండ్రివి నీవు తగు బ్రహ్మాదులకు యెల్లగా నీతల్లిదండ్రు లెవ్వరందును యిల్లిదె వరములు నీ విత్తు విందరికిని చెల్లఁబో నీకొకదాత చెప్పఁగఁ జోటేది (॥అనం॥) జీవుల కేలికవు శ్రీవేంకటేశుఁడవు నీ- వేవలఁ జూచిన నీ కే యేలికే లేఁడు వేవేలు మునులును వెదకేరు నిన్నును నీవెవ్వరి వెదకేవు నిర్మలమూరితివి English(||pallavi||) anaṁtamahimum̐ḍavu anaṁtaśha ktivi nīvu yĕnaleni daivamā ninnemani nudiṁtunu (||anaṁ||) annilogamulu nīyaṁdu nunnavaṁduru nī- vunnaloga miṭṭidani vūhiṁcharādu yĕnna nīvu rakṣhagum̐ḍa viṁdaribāliḍigi ninnu rakṣhiṁcheḍivāri nenĕvvari naṁdunu (||anaṁ||) tallivi daṁḍrivi nīvu tagu brahmādulagu yĕllagā nīdallidaṁḍru lĕvvaraṁdunu yillidĕ varamulu nī vittu viṁdarigini sĕllam̐bo nīgŏgadāda sĕppam̐gam̐ joḍedi (||anaṁ||) jīvula keligavu śhrīveṁkaḍeśhum̐ḍavu nī- vevalam̐ jūsina nī ke yelige lem̐ḍu vevelu munulunu vĕdageru ninnunu nīvĕvvari vĕdagevu nirmalamūridivi