Title (Indic)అంత విచ్చి చెప్పకు మా కప్పటి నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అంత విచ్చి చెప్పకు మా కప్పటి నీవు యింతా నీ మన్ననలోనె యెఱఁగరాదా (॥అంత॥) వీనులకు నేఁజేసేవిన్నపము చవులైతే నావినాని నీవలపు ననలొత్తీని ఆనందించి నీకు నాపై నంతబత్తి గలిగితే కానరాదా నీమోము కళలలోనె (॥అంత॥) సోగలుగా నేఁజూచేచూపులే నీకితవైతే చేఁగదేరేనీమనసు చిగిరించీని వేగిరించి నన్నుఁ బొందేవేడుక నీకుఁ గలితే లాగుగాఁ దెలియదా సెలవినవ్వులోనె (॥అంత॥) చెనకేనాసరసము చిత్తాన నీకుఁ బట్టితే పనివడి నీకోరిక ఫలియించీని యెనయుచు శ్రీవేంకటేశ నన్ను నేలితివి ననుపెల్లాఁ దోఁచగా యీనయములోనె English(||pallavi||) aṁta vichchi sĕppagu mā kappaḍi nīvu yiṁtā nī mannanalonĕ yĕṟam̐garādā (||aṁta||) vīnulagu nem̐jesevinnabamu savulaide nāvināni nīvalabu nanalŏttīni ānaṁdiṁchi nīgu nābai naṁtabatti galigide kānarādā nīmomu kaḽalalonĕ (||aṁta||) sogalugā nem̐jūsesūbule nīgidavaide sem̐gaderenīmanasu sigiriṁchīni vegiriṁchi nannum̐ bŏṁdeveḍuga nīgum̐ galide lāgugām̐ dĕliyadā sĕlavinavvulonĕ (||aṁta||) sĕnagenāsarasamu sittāna nīgum̐ baṭṭide panivaḍi nīgoriga phaliyiṁchīni yĕnayusu śhrīveṁkaḍeśha nannu nelidivi nanubĕllām̐ dom̐sagā yīnayamulonĕ