Title (Indic)అమ్మెడి దొకటి అసిమలో దొకటి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అమ్మెడి దొకటి అసిమలో దొకటి బిమ్మిటి నిందేటిపెద్దలమయ్యా (॥అమ్మె॥) సంగము మానక శాంతియుఁ గలుగదు సంగలంపటము సంసారము యెంగిలిదేహం బింతకు మూలము బెంగల మిందేఁటి పెద్దలమయ్యా (॥అమ్మె॥) కోరికె లుడుగక కోపం బుడుగదు కోరకుండ దిక్కువ మనసు క్రూరత్వమునకు కుదువ యీబ్రదుకు పేరడి నేమిటి పెద్దలమయ్యా (॥అమ్మె॥) ఫలము లందితే బంధము వీడదు ఫలముతో తగులు ప్రపంచము యిలలో శ్రీవేంకటేశు దాసులము పిలువఁగ నేమిటి పెద్దలమయ్యా English(||pallavi||) ammĕḍi dŏgaḍi asimalo dŏgaḍi bimmiḍi niṁdeḍibĕddalamayyā (||ammĕ||) saṁgamu mānaga śhāṁtiyum̐ galugadu saṁgalaṁpaḍamu saṁsāramu yĕṁgilidehaṁ biṁtagu mūlamu bĕṁgala miṁdem̐ṭi pĕddalamayyā (||ammĕ||) korigĕ luḍugaga kobaṁ buḍugadu koraguṁḍa dikkuva manasu krūratvamunagu kuduva yībradugu peraḍi nemiḍi pĕddalamayyā (||ammĕ||) phalamu laṁdide baṁdhamu vīḍadu phalamudo tagulu prabaṁchamu yilalo śhrīveṁkaḍeśhu dāsulamu piluvam̐ga nemiḍi pĕddalamayyā