Title (Indic)అందుకు నిందుకుఁ బతి ఆయఁగదరా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అందుకు నిందుకుఁ బతి ఆయఁగదరా నందకధరుఁడ నేఁడు నవ్వువచ్చీ నాకు (॥అందు॥) పిన్నదాననై బొమ్మపెండ్లి నేఁ జేయఁగాను నన్నుఁ జూచి నీవు నాఁడే నవ్వితివిగదరా చెన్నుగ నాకిట్టె సన్న సేసి నీవు గూడఁగాను నన్ను నిన్నుఁ జూచి నేఁడు నవ్వు వచ్చీ నాకు (॥అందు॥) పడుచులు నేను చెట్టాపట్టాలు పట్టు కాడఁగా నడుమనే నన్నుఁ జూచి నవ్వితివి గదరా చిడుముడి నీవు నన్నుఁ జెట్టివట్టుకోఁగా నేఁడు నడుకొత్తి నిన్నుఁ జూచి నవ్వువచ్చీ నాకు (॥అందు॥) పొలసి గుజ్జనఁగూళ్ల బువ్వాలాడే నన్నుఁ జూచి నలువంక నాఁడు నీవు నవ్వితివి గదరా యెలమి శ్రీవేంకటేశ యిటు నా మోవిబువ్వము నలి నీ వంటి కూడఁగా నవ్వువచ్చీ నాకు English(||pallavi||) aṁdugu niṁdugum̐ badi āyam̐gadarā naṁdagadharum̐ḍa nem̐ḍu navvuvachchī nāgu (||aṁdu||) pinnadānanai bŏmmabĕṁḍli nem̐ jeyam̐gānu nannum̐ jūsi nīvu nām̐ḍe navvidivigadarā sĕnnuga nāgiṭṭĕ sanna sesi nīvu gūḍam̐gānu nannu ninnum̐ jūsi nem̐ḍu navvu vachchī nāgu (||aṁdu||) paḍusulu nenu sĕṭṭābaṭṭālu paṭṭu kāḍam̐gā naḍumane nannum̐ jūsi navvidivi gadarā siḍumuḍi nīvu nannum̐ jĕṭṭivaṭṭugom̐gā nem̐ḍu naḍugŏtti ninnum̐ jūsi navvuvachchī nāgu (||aṁdu||) pŏlasi gujjanam̐gūḽla buvvālāḍe nannum̐ jūsi naluvaṁka nām̐ḍu nīvu navvidivi gadarā yĕlami śhrīveṁkaḍeśha yiḍu nā movibuvvamu nali nī vaṁṭi kūḍam̐gā navvuvachchī nāgu