Title (Indic)అందుకు నే వద్దనేనా అయ్యో నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అందుకు నే వద్దనేనా అయ్యో నిన్ను మందలించి యిదె నొకమాయ సేయవలెనా (॥॥) విరహ వేదనే వేళ విసిగిన నా విసువు అరసి యెగ్గులు వట్టే వది యేరా పొరి నెవ్వతింటికైనాఁ బోవలసో యీపొద్దు వొరసి నాపై నిదొక మాల వేసేవు (॥॥) ననిచి యేకత వేళ నవ్వినట్టి నవ్వులు యెనసి రచ్చలఁ బెట్టే విధి యేరా మనసురానివాఁడవు మతకాలు సేసి నేను పెనఁగఁ గానె నాతో బిగువు లాడేవూ (॥॥) భావపరవశమునఁ బలికిన పలుకులు చేవల వాఁడి సేసేవు చెల్లఁ బోయెరా యీవల శ్రీ వేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి నావద్ద నుండవలసి నన్నుఁ గొసరేవూ. English(||pallavi||) aṁdugu ne vaddanenā ayyo ninnu maṁdaliṁchi yidĕ nŏgamāya seyavalĕnā (||||) viraha vedane veḽa visigina nā visuvu arasi yĕggulu vaṭṭe vadi yerā pŏri nĕvvadiṁṭigainām̐ bovalaso yībŏddu vŏrasi nābai nidŏga māla vesevu (||||) nanisi yegada veḽa navvinaṭṭi navvulu yĕnasi rachchalam̐ bĕṭṭe vidhi yerā manasurānivām̐ḍavu madagālu sesi nenu pĕnam̐gam̐ gānĕ nādo biguvu lāḍevū (||||) bhāvabaravaśhamunam̐ baligina palugulu sevala vām̐ḍi sesevu sĕllam̐ boyĕrā yīvala śhrī veṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi nāvadda nuṁḍavalasi nannum̐ gŏsarevū.