Title (Indic)అందుకే తా నెగ్గువట్టీ నంతేకాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అందుకే తా నెగ్గువట్టీ నంతేకాక పొందిన పతికి మీరే బుద్ది చెప్పరమ్మా (॥అందు॥) కోపగించితినటనే కొంగవట్టి తియ్యఁగాను వోపనంటాఁ బెనఁగితి నూరకే నేను పైపైఁ దిట్టితినటే వచ్చిమాట లాడఁగాను కోపులఁ బెదవులనే గొణఁగితిఁ గాక (॥అందు॥) కైకోనటవే నేను గబ్బితనాల నుండఁగ ఆకడ నే నవ్వలి మోమైతిఁ గాక జోకఁ దాఁ బిలిచినట్టి చోటికి రానటే నేను యేకతానఁ దా నుండఁగా ఇంట నుంటిఁగాక (॥అందు॥) కూడివుండనటే నేను గొబ్బున నుమ్మగించఁగా వాడు వాకిటికేఁగి వంతనుంటిని వేడుక శ్రీవేంకటాద్రివిభుఁడు నన్నిటు గూడె పాడిపంతా లెఱఁగనా భ్రమసితిఁ గాక English(||pallavi||) aṁduge tā nĕgguvaṭṭī naṁtegāga pŏṁdina padigi mīre buddi sĕpparammā (||aṁdu||) kobagiṁchidinaḍane kŏṁgavaṭṭi tiyyam̐gānu vobanaṁṭām̐ bĕnam̐gidi nūrage nenu paibaim̐ diṭṭidinaḍe vachchimāḍa lāḍam̐gānu kobulam̐ bĕdavulane gŏṇam̐gidim̐ gāga (||aṁdu||) kaigonaḍave nenu gabbidanāla nuṁḍam̐ga āgaḍa ne navvali momaidim̐ gāga jogam̐ dām̐ bilisinaṭṭi soḍigi rānaḍe nenu yegadānam̐ dā nuṁḍam̐gā iṁṭa nuṁṭim̐gāga (||aṁdu||) kūḍivuṁḍanaḍe nenu gŏbbuna nummagiṁcham̐gā vāḍu vāgiḍigem̐gi vaṁtanuṁṭini veḍuga śhrīveṁkaḍādrivibhum̐ḍu nanniḍu gūḍĕ pāḍibaṁtā lĕṟam̐ganā bhramasidim̐ gāga