Title (Indic)అందరి రక్షించే దేవుఁ డాదరించీ జీవులను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అందరి రక్షించే దేవుఁ డాదరించీ జీవులను పొందుగా యీమేలెరిఁగి పొగడరో లోకులు (॥అంద॥) వనము వెట్టినవాఁడు వాఁడకుండా నీరు వోసి పెనచి కలుపు దీసి పెంచినయట్లు పనివడి గొల్లవాఁడు పచ్చికపట్టునఁ బసుల తనియఁగ నిల్పి నిల్పి తానే మేపినట్లు (॥అంద॥) కన్నతల్లి బిడ్డలకు కానుక వెన్నయుఁ బాలు- నన్నము నిడి రక్షించినటువలెను యెన్నఁగ బంట్లనేలే యేలిక జీతాలు వెట్టి మన్నించి కాచుకొని మనిపినయట్లు (॥అంద॥) వసుధ వైద్యుఁడైనవాడు మందుమాకు లిచ్చి పొసఁగ దేహధారులఁ బోషించినట్లు యెసఁగ శ్రీవేంకటేశుఁ డితఁడే విశ్వకుటింబి పసగా వరము లిచ్చి భావించీనట్లు English(||pallavi||) aṁdari rakṣhiṁche devum̐ ḍādariṁchī jīvulanu pŏṁdugā yīmelĕrim̐gi pŏgaḍaro logulu (||aṁda||) vanamu vĕṭṭinavām̐ḍu vām̐ḍaguṁḍā nīru vosi pĕnasi kalubu dīsi pĕṁchinayaṭlu panivaḍi gŏllavām̐ḍu pachchigabaṭṭunam̐ basula taniyam̐ga nilbi nilbi tāne mebinaṭlu (||aṁda||) kannadalli biḍḍalagu kānuga vĕnnayum̐ bālu- nannamu niḍi rakṣhiṁchinaḍuvalĕnu yĕnnam̐ga baṁṭlanele yeliga jīdālu vĕṭṭi manniṁchi kāsugŏni manibinayaṭlu (||aṁda||) vasudha vaidyum̐ḍainavāḍu maṁdumāgu lichchi pŏsam̐ga dehadhārulam̐ boṣhiṁchinaṭlu yĕsam̐ga śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe viśhvaguḍiṁbi pasagā varamu lichchi bhāviṁchīnaṭlu