Title (Indic)అందాఁకా నీకు మొక్కుతా నంతా నింతా నుండేఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అందాఁకా నీకు మొక్కుతా నంతా నింతా నుండేఁ గాక యిందరిలోఁ బదరితే నిది సిగ్గు గాదా (॥అందా॥) ఆవల నీ వొకతెతో అట్టె మాటలాడఁగాను చేపట్టి తియ్యగ బోతే సిగ్గు గాదా వావిరి నాపెయు నీవు వసంతము లాడఁగాను యీ వేళ నీ మోము చూచి దిది సిగ్గు గాదా (॥అందా॥) కోరటు పరాకై నీవు కొమ్మను గూడుండగాను చేరి నీతో నవ్వఁబోతే సిగ్గు గాదా గారవించి యాపెతోయాకతము నీ వాడఁగాను యీరీతి దగ్గరితేను యిది సిగ్గు గాదా (॥అందా॥) అక్కడిరతుల నీవు అలసి వుండేవేళ చెక్కులు నే నొక్కితేను సిగ్గు గాదా గక్కన శ్రీవెంకటేశ కలసితి విటు నన్ను యిక్కడ నవి దడవే దిది సిగ్గు గాదా English(||pallavi||) aṁdām̐kā nīgu mŏkkudā naṁtā niṁtā nuṁḍem̐ gāga yiṁdarilom̐ badaride nidi siggu gādā (||aṁdā||) āvala nī vŏgadĕdo aṭṭĕ māḍalāḍam̐gānu sebaṭṭi tiyyaga bode siggu gādā vāviri nābĕyu nīvu vasaṁtamu lāḍam̐gānu yī veḽa nī momu sūsi didi siggu gādā (||aṁdā||) koraḍu parāgai nīvu kŏmmanu gūḍuṁḍagānu seri nīdo navvam̐bode siggu gādā gāraviṁchi yābĕdoyāgadamu nī vāḍam̐gānu yīrīdi daggaridenu yidi siggu gādā (||aṁdā||) akkaḍiradula nīvu alasi vuṁḍeveḽa sĕkkulu ne nŏkkidenu siggu gādā gakkana śhrīvĕṁkaḍeśha kalasidi viḍu nannu yikkaḍa navi daḍave didi siggu gādā