Title (Indic)అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి కలికి నీ వొళ్ల నివి కంటిమే చెలియా (॥అల॥) బలిమిగలవారికిని పంతంబు లీడేరు కలిమిగలవారికిని గర్వమమరు చలముగలవారికిని సరసంబు లనువుపడు కలదెల్ల నీ వొళ్ల గంటిమే చెలియా (॥అల॥) ననుపుగలవారికిని నవ్వినంతయుఁ జెల్లు చనవుగలవారికిని జరగుఁ బొందు మనసుగలవారికిని మలసి నెనఁగఁవచ్చు ఘనతలివి నీవొళ్ల గంటిమే చెలియా (॥అల॥) వెరవుగలవారికిని వేడుకలు నెలవుకొను సిరులుగలవారికినిఁ జేరు కీర్తి యిరవుకొని శ్రీవేంకటేశ్వరుఁడు నిను నేలె గరిమి లివి నీవొళ్ల గొంటిమే చెలియా English(||pallavi||) alamelumaṁga nīvanniḍā nŏrabarivi kaligi nī vŏḽla nivi kaṁṭime sĕliyā (||ala||) balimigalavārigini paṁtaṁbu līḍeru kalimigalavārigini garvamamaru salamugalavārigini sarasaṁbu lanuvubaḍu kaladĕlla nī vŏḽla gaṁṭime sĕliyā (||ala||) nanubugalavārigini navvinaṁtayum̐ jĕllu sanavugalavārigini jaragum̐ bŏṁdu manasugalavārigini malasi nĕnam̐gam̐vachchu ghanadalivi nīvŏḽla gaṁṭime sĕliyā (||ala||) vĕravugalavārigini veḍugalu nĕlavugŏnu sirulugalavāriginim̐ jeru kīrdi yiravugŏni śhrīveṁkaḍeśhvarum̐ḍu ninu nelĕ garimi livi nīvŏḽla gŏṁṭime sĕliyā