Title (Indic)అటువంటి వైభవము లమరఁజేసిన దైవ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అటువంటి వైభవము లమరఁజేసిన దైవ- మిటువంటి యోగంబు లిన్నియును జేసి (॥అటు॥) జలజాక్షి లావణ్య జలధి నుప్పొంగింప నలివేణి ముఖచంద్రుఁ డభ్యుదయమాయ కలికి వలరాయఁడను కాలకూటంబుతో దలకొన్న యధరామృతంబు జన్మించె (॥అటు॥) వనిత సౌభాగ్యంబువనధిలోపలఁ దోఁచె గొనకొన్న గుఱుతైన కుచపర్వతములు తనివోనికోరికల తగుతురంగములతో ననువైన విరహ బడబానలము గలిగె (॥అటు॥) భామ యవ్వనమనెడి పాలజలనిధిలోన వామాక్షియైన యవ్వనలక్ష్మీ గలిగె యీమంచి తిరువేంకటేశ్వరుం డిందులోఁ బ్రేమమున సుఖియించి పెంపొందఁగలిగె English(||pallavi||) aḍuvaṁṭi vaibhavamu lamaram̐jesina daiva- miḍuvaṁṭi yogaṁbu linniyunu jesi (||aḍu||) jalajākṣhi lāvaṇya jaladhi nuppŏṁgiṁpa naliveṇi mukhasaṁdrum̐ ḍabhyudayamāya kaligi valarāyam̐ḍanu kālagūḍaṁbudo dalagŏnna yadharāmṛtaṁbu janmiṁchĕ (||aḍu||) vanida saubhāgyaṁbuvanadhilobalam̐ dom̐sĕ gŏnagŏnna guṟudaina kusabarvadamulu tanivonigorigala taguduraṁgamulado nanuvaina viraha baḍabānalamu galigĕ (||aḍu||) bhāma yavvanamanĕḍi pālajalanidhilona vāmākṣhiyaina yavvanalakṣhmī galigĕ yīmaṁchi tiruveṁkaḍeśhvaruṁ ḍiṁdulom̐ bremamuna sukhiyiṁchi pĕṁpŏṁdam̐galigĕ