Title (Indic)అడుగరే చెలులాల ఆతనినే యీ మాట WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అడుగరే చెలులాల ఆతనినే యీ మాట యెడయని విన్నపము లివి నావి యనరే (॥॥) వినయము గలిగిన వెలఁది పొందులు చవి మనసు నమ్మిన యట్టి మాటలు చవి తనివోని వలపుల తలపోఁతలు చవి పెనగొన్న కౌఁగిటిలో బిగువు చవి (॥॥) మచ్చికలు సలిపేటి మంతనంబులు చవి ఇచ్చకము నడుపేటి యింపులు చవి విచ్చన విళ్ళైన వేడుక చేఁతలు చవి కొచ్చి కొచ్చి కొసరేటి కూరిమి చవి (॥॥) మొక్కుచు సారెకుఁ జూచే మచ్చట చూపులు చవి చొక్కేటి రతి వేళల సుద్దులు చవి యిక్కడ శ్రీ వేంకటేశుఁడింతలోనే నన్నుఁగూడె దక్కిన తమకముల తరితీవులు చవి English(||pallavi||) aḍugare sĕlulāla ādanine yī māḍa yĕḍayani vinnabamu livi nāvi yanare (||||) vinayamu galigina vĕlam̐di pŏṁdulu savi manasu nammina yaṭṭi māḍalu savi tanivoni valabula talabom̐talu savi pĕnagŏnna kaum̐giḍilo biguvu savi (||||) machchigalu salibeḍi maṁtanaṁbulu savi ichchagamu naḍubeḍi yiṁpulu savi vichchana viḽḽaina veḍuga sem̐talu savi kŏchchi kŏchchi kŏsareḍi kūrimi savi (||||) mŏkkusu sārĕgum̐ jūse machchaḍa sūbulu savi sŏkkeḍi radi veḽala suddulu savi yikkaḍa śhrī veṁkaḍeśhum̐ḍiṁtalone nannum̐gūḍĕ dakkina tamagamula taridīvulu savi