Title (Indic)అదియూఁ జూతము గాని అందుకేమాయ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అదియూఁ జూతము గాని అందుకేమాయ యెదుటనే వుండేనని యిట్టె యాన వెట్టుమా (॥అది॥) ఆఁపలేక గొల్లెతల నందరినిఁ జెనకేపు కాఁపురము సేసేవారిఁ గాకు సేతురా తీపులనే యింత సేసితివి యిఁకనైన నీవు యేఁపక యేలేనని యిట్టె యానవెట్టుమా (॥అది॥) గొరబుగా మగనాండ్లఁ గొప్పువట్టి తీసేవు నెరుసు లేనివారిపై నిందవేతురా వరవాత నెలయించి వలపించిన వాఁడవు యిరవై యేలేనని యిట్టె యాన వెట్టుమా (॥అది॥) సేసవెట్టి కూడితివి శ్రీ వేంకటేశ్వర మమ్ము ఆసతోడివారి నిన్నాళ్లలయింతురా రాసికెక్క బ్రమయించి రవ్వసేసినవాఁడవు యీసేవ మఱవనని యిట్టెయాన వెట్టుమా English(||pallavi||) adiyūm̐ jūdamu gāni aṁdugemāya yĕduḍane vuṁḍenani yiṭṭĕ yāna vĕṭṭumā (||adi||) ām̐palega gŏllĕdala naṁdarinim̐ jĕnagebu kām̐puramu sesevārim̐ gāgu sedurā tībulane yiṁta sesidivi yim̐kanaina nīvu yem̐paga yelenani yiṭṭĕ yānavĕṭṭumā (||adi||) gŏrabugā maganāṁḍlam̐ gŏppuvaṭṭi tīsevu nĕrusu lenivāribai niṁdavedurā varavāda nĕlayiṁchi valabiṁchina vām̐ḍavu yiravai yelenani yiṭṭĕ yāna vĕṭṭumā (||adi||) sesavĕṭṭi kūḍidivi śhrī veṁkaḍeśhvara mammu āsadoḍivāri ninnāḽlalayiṁturā rāsigĕkka bramayiṁchi ravvasesinavām̐ḍavu yīseva maṟavanani yiṭṭĕyāna vĕṭṭumā