Title (Indic)అది నా భాగ్యమేకాక ఆతఁడేమి సేసునే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అది నా భాగ్యమేకాక ఆతఁడేమి సేసునే అదనైనందాఁక నింతే ఆతఁడేమి సేసునే (॥అది॥) కలువకన్నులఁ జూచె ఘను డాతఁ డవె నాకు అలరుబాణములై తే నతఁ డేమిసేసునే పలుకుఁదేనెల నాతోఁ బలికె నవె నాకు చిలుకుబాసటమైతే సేయుమనే దేమే (॥అది॥) వెన్నెలనవ్వులు నవ్వె విభుఁ డాతఁ డవె నాకు నన్నువట్టియెండలై తే నాతఁ డేమిసేసునే సన్నిధిఁ గప్రము చల్లె సరసపువేళ నాకు నన్నిటాఁ జొక్కుమందైతే నాతఁ డేమిసేసునే (॥అది॥) కొంగువట్టి తీసి నన్నుఁ గూడె నాతఁ డది నాకు నంగమెల్ల మఱిపంచె నాతఁ డేమిసేసునే ఇంగితపుశ్రీవేంకటేశుఁడు మోహించఁగాను అంగడి కెక్కె వలపు ఆతఁ డేమిసేసునే English(||pallavi||) adi nā bhāgyamegāga ādam̐ḍemi sesune adanainaṁdām̐ka niṁte ādam̐ḍemi sesune (||adi||) kaluvagannulam̐ jūsĕ ghanu ḍādam̐ ḍavĕ nāgu alarubāṇamulai te nadam̐ ḍemisesune palugum̐denĕla nādom̐ baligĕ navĕ nāgu silugubāsaḍamaide seyumane deme (||adi||) vĕnnĕlanavvulu navvĕ vibhum̐ ḍādam̐ ḍavĕ nāgu nannuvaṭṭiyĕṁḍalai te nādam̐ ḍemisesune sannidhim̐ gapramu sallĕ sarasabuveḽa nāgu nanniḍām̐ jŏkkumaṁdaide nādam̐ ḍemisesune (||adi||) kŏṁguvaṭṭi tīsi nannum̐ gūḍĕ nādam̐ ḍadi nāgu naṁgamĕlla maṟibaṁchĕ nādam̐ ḍemisesune iṁgidabuśhrīveṁkaḍeśhum̐ḍu mohiṁcham̐gānu aṁgaḍi kĕkkĕ valabu ādam̐ ḍemisesune