Title (Indic)అతని మన్ననే చూచే వప్పుడె నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అతని మన్ననే చూచే వప్పుడె నీవు యితవై మీ యిద్దరిలో యెంతసమ్మతములో (॥అత॥) చెలువుని మోము చూచి సెలవులఁ బార నవ్వి చెలితో మాటలాడేవు చెల్లఁబో నీవు అలవోకఁ బవళించి యాకుమడి చిచ్చేవు అల వెఱఁగవు పతి నౌనే నీవు (॥ఆత॥) కాటుక దీరుచుకొంటా ఘనునితోఁ బలికేవు నేటివలె నుండునటె నేరవు నీవు నీటున నొయ్యారిబాగై నిలుచుండి మొక్కేవు వోటలేదు దొరచిత్తా లొకరీతి నుండునా (॥అత॥) తొడమీఁదఁ దొడవేసి దొరతనమే చూపేవు నడుమ శ్రీవేంకటేశు నంటున నీవు జడికొని దోమతెరచాటునఁ గూడి మాకు నడియాలాలు చూపేవు అంతలో నీవు English(||pallavi||) adani mannane sūse vappuḍĕ nīvu yidavai mī yiddarilo yĕṁtasammadamulo (||ada||) sĕluvuni momu sūsi sĕlavulam̐ bāra navvi sĕlido māḍalāḍevu sĕllam̐bo nīvu alavogam̐ bavaḽiṁchi yāgumaḍi sichchevu ala vĕṟam̐gavu padi naune nīvu (||āda||) kāḍuga dīrusugŏṁṭā ghanunidom̐ baligevu neḍivalĕ nuṁḍunaḍĕ neravu nīvu nīḍuna nŏyyāribāgai nilusuṁḍi mŏkkevu voḍaledu dŏrasittā lŏgarīdi nuṁḍunā (||ada||) tŏḍamīm̐dam̐ dŏḍavesi dŏradaname sūbevu naḍuma śhrīveṁkaḍeśhu naṁṭuna nīvu jaḍigŏni domadĕrasāḍunam̐ gūḍi māgu naḍiyālālu sūbevu aṁtalo nīvu