Title (Indic)అటమీఁది పనులకు హరి నీవే కలవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అటమీఁది పనులకు హరి నీవే కలవు సటలైనా నిజమైనా జరపేము గాక (॥అట॥) పరమాత్మ నీమాయఁ బాయగ నే నెంతవాఁడ దొరయైతే రాజాజ్ఞ దోయవచ్చునా తొరలిన యింద్రియాలఁ దోసిపోవ నెట్టువచ్చు సిరుల నేలికపంపు సేయు టింతేకాక (॥అట॥) శ్రీపతి యీసంసారము సేయకుండ నెంతవాఁడ మాపుదాఁకా రాచవెట్టి మానవచ్చునా పాపపుణ్యము లొల్లక పరగ నాకెట్టు వచ్చు తేపఁ దల్లి వుగ్గువెట్టఁ దినకుండవచ్చునా (॥అట॥) దేవ నీవిచ్చినమేను తెగి రోయ నెంతవాఁడ కావించి రాచయీవికిఁ గడమున్నదా శ్రీవేంకటేశ నీచిత్తములోవాఁడ నింతే యేవిధిఁ బెట్టినా నేనియ్యకొంటగాక English(||pallavi||) aḍamīm̐di panulagu hari nīve kalavu saḍalainā nijamainā jarabemu gāga (||aḍa||) paramātma nīmāyam̐ bāyaga ne nĕṁtavām̐ḍa dŏrayaide rājājña doyavachchunā tŏralina yiṁdriyālam̐ dosibova nĕṭṭuvachchu sirula neligabaṁpu seyu ṭiṁtegāga (||aḍa||) śhrībadi yīsaṁsāramu seyaguṁḍa nĕṁtavām̐ḍa mābudām̐kā rāsavĕṭṭi mānavachchunā pābabuṇyamu lŏllaga paraga nāgĕṭṭu vachchu tebam̐ dalli vugguvĕṭṭam̐ dinaguṁḍavachchunā (||aḍa||) deva nīvichchinamenu tĕgi roya nĕṁtavām̐ḍa kāviṁchi rāsayīvigim̐ gaḍamunnadā śhrīveṁkaḍeśha nīsittamulovām̐ḍa niṁte yevidhim̐ bĕṭṭinā neniyyagŏṁṭagāga