Title (Indic)ఆయనాయ నీకింత యాచారాల గొడవేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయనాయ నీకింత యాచారాల గొడవేల పాయపు మదము నీవు పట్టుకుండఁ గలవా (॥ఆయ॥) పూచినతంగేడువలెఁ బొలఁతి సింగారించుక యేచి నిలుచున్నది నీయెదుటను చేచేత చెరఁగుమాసి వుండితే నేమాయ చూచిచూచి యంట కోరుచుకుండఁగలవా (॥ఆయ॥) పచ్చనిచిలుకవలెఁ బడఁతి చదువుకొంటా మచ్చికలు చూపీ నీమంచముపొంత మెచ్చులుగ దడిబెముమీఁద నుంటే నేమాయ కిచ్చురేఁగి ముట్టి తమకించకుండఁగలవా (॥ఆయ॥) మూసినముత్యమువలె ముదిత కాఁగిట నిల్చి ఆసకొల్పీ శ్రీవేంకటాధిప నిన్ను సేసవెట్టి నాలునాళ్లు చేసితే నందుకేమాయ వాసితోడఁ బొంది వలవకుండఁగలవా English(||pallavi||) āyanāya nīgiṁta yāsārāla gŏḍavela pāyabu madamu nīvu paṭṭuguṁḍam̐ galavā (||āya||) pūsinadaṁgeḍuvalĕm̐ bŏlam̐ti siṁgāriṁchuga yesi nilusunnadi nīyĕduḍanu seseda sĕram̐gumāsi vuṁḍide nemāya sūsisūsi yaṁṭa korusuguṁḍam̐galavā (||āya||) pachchanisilugavalĕm̐ baḍam̐ti saduvugŏṁṭā machchigalu sūbī nīmaṁchamubŏṁta mĕchchuluga daḍibĕmumīm̐da nuṁṭe nemāya kichchurem̐gi muṭṭi tamagiṁchaguṁḍam̐galavā (||āya||) mūsinamutyamuvalĕ mudida kām̐giḍa nilsi āsagŏlbī śhrīveṁkaḍādhiba ninnu sesavĕṭṭi nālunāḽlu seside naṁdugemāya vāsidoḍam̐ bŏṁdi valavaguṁḍam̐galavā