Title (Indic)ఆయనాయ నీడ సరి యాఁక లేఁటికి నీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయనాయ నీడ సరి యాఁక లేఁటికి నీ నే యింతికి వలచిన యీడకే తెచ్చే నయ్యా (॥ఆయ॥) చిత్తమొకవంకఁ బెట్టి చేరి నీవు నాకు వట్టి బత్తు లెంత సేసినాను ఫల మేది హత్తి నీకు నేనెంత ఆయములు ముట్టినాను కత్తిఁ గోసి నట్టే కాక కరఁగీనా మనసు (॥ఆయ॥) చూపు లొకతెపైఁ బెట్టి సొరిది నాతోఁ బెదవి పైపయిమాట లాడితే పస లేదు మాపుదాఁకా ని న్నెంత మంచానకుఁ దీసినాను కోపము వేసటే కాని కూటమి చాలదయ్యా (॥ఆయ॥) కాఁక లొకతెకుఁ జేసి కాయము నావై వేసితే మాఁకువలె నుండుఁ గాక మర్మ మంటీనా యేఁకటతో శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి ఆఁకటిరతి వేళకు ఆపెనే నే నయ్యా English(||pallavi||) āyanāya nīḍa sari yām̐ka lem̐ṭigi nī ne yiṁtigi valasina yīḍage tĕchche nayyā (||āya||) sittamŏgavaṁkam̐ bĕṭṭi seri nīvu nāgu vaṭṭi battu lĕṁta sesinānu phala medi hatti nīgu nenĕṁta āyamulu muṭṭinānu kattim̐ gosi naṭṭe kāga karam̐gīnā manasu (||āya||) sūbu lŏgadĕbaim̐ bĕṭṭi sŏridi nādom̐ bĕdavi paibayimāḍa lāḍide pasa ledu mābudām̐kā ni nnĕṁta maṁchānagum̐ dīsinānu kobamu vesaḍe kāni kūḍami sāladayyā (||āya||) kām̐ka lŏgadĕgum̐ jesi kāyamu nāvai veside mām̐kuvalĕ nuṁḍum̐ gāga marma maṁṭīnā yem̐kaḍado śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi ām̐kaḍiradi veḽagu ābĕne ne nayyā