Title (Indic)ఆయము లిఁక నిద్దరి కంటుఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయము లిఁక నిద్దరి కంటుఁ గాక చేయివల్ల నుండ నేలె చేఁతల యాతనికి (॥ఆయ॥) నిగ్గుల నాతఁ డన్నియు నీకెతోఁ జెప్పఁగాను యెగ్గు లేల పట్టేవె యేమే నీవు సిగ్గులు నిను రేఁచితె చింతఁ బొరలేదానవు దగ్గరి కూచుండ నేలె తమకపాతనివి (॥ఆయ॥) నెమ్మది నీమోము చూచి నీవిభుఁడె నవ్వఁగాను యెమ్మె లేల సేసేవె యేమే నీవు కమ్మ నీకు మొక్కి తేనె కాఁక రేఁగేదానవు చెమ్మఁజెమ టార్చ నేలె సేవల నాతనికి (॥ఆయ॥) వెకలి శ్రీవెంకటాద్రివిభుఁ డిట్టె కూడఁగాను యెకసక్కే లే లాడేవె యేమే నీవు వొకటొకటికి నీవు వొరసెటిదానవు మొకమిచ్చ లాడ నేలె మొదలె యాతనిని English(||pallavi||) āyamu lim̐ka niddari kaṁṭum̐ gāga seyivalla nuṁḍa nelĕ sem̐tala yādanigi (||āya||) niggula nādam̐ ḍanniyu nīgĕdom̐ jĕppam̐gānu yĕggu lela paṭṭevĕ yeme nīvu siggulu ninu rem̐sidĕ siṁtam̐ bŏraledānavu daggari kūsuṁḍa nelĕ tamagabādanivi (||āya||) nĕmmadi nīmomu sūsi nīvibhum̐ḍĕ navvam̐gānu yĕmmĕ lela sesevĕ yeme nīvu kamma nīgu mŏkki tenĕ kām̐ka rem̐gedānavu sĕmmam̐jĕma ṭārsa nelĕ sevala nādanigi (||āya||) vĕgali śhrīvĕṁkaḍādrivibhum̐ ḍiṭṭĕ kūḍam̐gānu yĕgasakke le lāḍevĕ yeme nīvu vŏgaḍŏgaḍigi nīvu vŏrasĕḍidānavu mŏgamichcha lāḍa nelĕ mŏdalĕ yādanini