Title (Indic)ఆయలేరే యేడ సుద్ది ఆతనికి నిది వన్నె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయలేరే యేడ సుద్ది ఆతనికి నిది వన్నె సేయుమన్నట్టెల్లా నేనే సేసేఁగాక (॥ఆయ॥) అట్టె రమణునికి నంతబాఁతే మామీంద పట్టినవ్రతాన నేనే పైకొనేఁగాక గుట్టు విడువఁ డాతండు కోరి మమ్ముఁ గైకొనీనా వెట్టివలపులదాన వెస నేనే కాక (॥ఆయ॥) తావుల పెక్కిండ్లవిందు తలఁచీనా మమ్ము నేండు కావలెననుచు నేనే కదిసేఁగాక దేవరవంటివాఁడు తెమలీనా తనుందానె వావులు వెదకేదాన వడి నేనే కాక (॥ఆయ॥) అమ్మరో శ్రీవేంకటేశు కపురూపమా చెలులు నెమ్మది మేనదాన నేనే కాక వుమ్మడిం బంతమాడక వూరకుండీనా యీతఁడు యెమ్మెల యిచ్చకురాల యేడా నేనే కాక English(||pallavi||) āyalere yeḍa suddi ādanigi nidi vannĕ seyumannaṭṭĕllā nene sesem̐gāga (||āya||) aṭṭĕ ramaṇunigi naṁtabām̐te māmīṁda paṭṭinavradāna nene paigŏnem̐gāga guṭṭu viḍuvam̐ ḍādaṁḍu kori mammum̐ gaigŏnīnā vĕṭṭivalabuladāna vĕsa nene kāga (||āya||) tāvula pĕkkiṁḍlaviṁdu talam̐sīnā mammu neṁḍu kāvalĕnanusu nene kadisem̐gāga devaravaṁṭivām̐ḍu tĕmalīnā tanuṁdānĕ vāvulu vĕdagedāna vaḍi nene kāga (||āya||) ammaro śhrīveṁkaḍeśhu kaburūbamā sĕlulu nĕmmadi menadāna nene kāga vummaḍiṁ baṁtamāḍaga vūraguṁḍīnā yīdam̐ḍu yĕmmĕla yichchagurāla yeḍā nene kāga