Title (Indic)ఆయ లేవే నీ యెతులన్నియుఁ గంటిమి నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయ లేవే నీ యెతులన్నియుఁ గంటిమి నేఁడు చాయలా సన్నలనే జరపేవు పొద్దులు (॥ఆయ॥) మొనసి చూచేవారి ముందరనెల్ల నీపతి- చనవులే నెరుపేవు సారె సారెను వినఁగలిగితేఁ జాలు వేసర కెందాఁకనైన పనిలేని కతలెల్లఁ బచరించేవిపుడు (॥ఆయ॥) యిమ్ముల నీవద్దనుంటే యెవ్వరికైనా నీ- సొమ్ములెల్లాఁ జూపేవు సోద్యాలుగాను సమ్మతించితేఁ జాలు సవతులనిందరిని పమ్మిన యీవులఁ గిందుపఱచేవు నీవు (॥ఆయ॥) చెలిమి నీతోఁ జేసితే శ్రీవేంకటేశ్వరుని కలయికకుఁ దెచ్చేవు కమ్మటి మమ్ము వలెనంటేఁ జాలు నీవారైన వారికెల్ల నెలవుగ నీమహిమ నెరుపేవు మిగుల English(||pallavi||) āya leve nī yĕdulanniyum̐ gaṁṭimi nem̐ḍu sāyalā sannalane jarabevu pŏddulu (||āya||) mŏnasi sūsevāri muṁdaranĕlla nībadi- sanavule nĕrubevu sārĕ sārĕnu vinam̐galigidem̐ jālu vesara kĕṁdām̐kanaina panileni kadalĕllam̐ basariṁchevibuḍu (||āya||) yimmula nīvaddanuṁṭe yĕvvarigainā nī- sŏmmulĕllām̐ jūbevu sodyālugānu sammadiṁchidem̐ jālu savadulaniṁdarini pammina yīvulam̐ giṁdubaṟasevu nīvu (||āya||) sĕlimi nīdom̐ jeside śhrīveṁkaḍeśhvaruni kalayigagum̐ dĕchchevu kammaḍi mammu valĕnaṁṭem̐ jālu nīvāraina vārigĕlla nĕlavuga nīmahima nĕrubevu migula