Title (Indic)ఆవధరించఁగదయ్య అన్నిరసములు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆవధరించఁగదయ్య అన్నిరసములు నీవు తివురుచు నబ్బెనిదె తేనె మోవిరసము (॥అవ॥) చెలియచక్కఁదనాన శృంగారరసము వెలయ బొమజంకెనల వీరరసము కలయు రతికాంక్షలను కరుణారసము అలరు మైపులకలను అద్భుతరసంబు (॥అవ॥) తరుణిసరసములను తగుహస్యరసము పరుషంపువిరహన భయరసంబు బెరయు నిబ్బరములను బీభత్సరసము గరిమ మరుయుద్ధాన ఘనరౌద్రరసము (॥అవ॥) వనిత ఆనందముల వడిశాంతరసము ననుపుమంతనములను నవరసములు యెనలేని శ్రీ వేంకటేశ నీతోఁ గూడి దిన దిన వినోదాల తిరమాయ రసము English(||pallavi||) āvadhariṁcham̐gadayya annirasamulu nīvu tivurusu nabbĕnidĕ tenĕ movirasamu (||ava||) sĕliyasakkam̐danāna śhṛṁgārarasamu vĕlaya bŏmajaṁkĕnala vīrarasamu kalayu radigāṁkṣhalanu karuṇārasamu alaru maibulagalanu adbhudarasaṁbu (||ava||) taruṇisarasamulanu taguhasyarasamu paruṣhaṁpuvirahana bhayarasaṁbu bĕrayu nibbaramulanu bībhatsarasamu garima maruyuddhāna ghanaraudrarasamu (||ava||) vanida ānaṁdamula vaḍiśhāṁtarasamu nanubumaṁtanamulanu navarasamulu yĕnaleni śhrī veṁkaḍeśha nīdom̐ gūḍi dina dina vinodāla tiramāya rasamu