Title (Indic)ఆసగించియున్నదాని నలయించనిఁకనేలే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆసగించియున్నదాని నలయించనిఁకనేలే పాసి వుండలేకుండితే బత్తిసేయవయ్యా (॥ఆ॥) మునుకొని యాపె వచ్చి ముందర నిలుచున్నది ననుపు గలిగితేను నవ్వవయ్యా వినయముతో నీకు విన్నపాలకు లాచీ పని గలిగితే మాటపలు కాడవయ్యా (॥ఆ॥) గుట్టుతోడ నీపొందులగుఱుతులెల్లాఁ జెప్పీ చుట్టమైతే నాపెదిక్కు చూడవయ్యా నెట్టుకొని సారె నిన్ను నేరుపున సొలసీని అట్టే నీకు నితవైతే నాదరించవయ్యా (॥ఆ॥) నియతానఁ జేరిచేరి నీకుఁ బాదాలొత్తవచ్చె ప్రియమైతే మంచముపైఁ బెట్టుకోవయ్యా నయాన శ్రీవేంకటేశ నన్నుఁ గూడితి విన్నిటా క్రియ గలితే నాపెపైఁ గేలు చాఁచవయ్యా English(||pallavi||) āsagiṁchiyunnadāni nalayiṁchanim̐kanele pāsi vuṁḍaleguṁḍide battiseyavayyā (||ā||) munugŏni yābĕ vachchi muṁdara nilusunnadi nanubu galigidenu navvavayyā vinayamudo nīgu vinnabālagu lāsī pani galigide māḍabalu kāḍavayyā (||ā||) guṭṭudoḍa nībŏṁdulaguṟudulĕllām̐ jĕppī suṭṭamaide nābĕdikku sūḍavayyā nĕṭṭugŏni sārĕ ninnu nerubuna sŏlasīni aṭṭe nīgu nidavaide nādariṁchavayyā (||ā||) niyadānam̐ jeriseri nīgum̐ bādālŏttavachchĕ priyamaide maṁchamubaim̐ bĕṭṭugovayyā nayāna śhrīveṁkaḍeśha nannum̐ gūḍidi vinniḍā kriya galide nābĕbaim̐ gelu sām̐savayyā