Title (Indic)ఆసగదా మోసపుచ్చె నయ్యా న న్నింతగాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆసగదా మోసపుచ్చె నయ్యా న న్నింతగాను వాసుల వలపులనే వలలఁ జిక్కితిని (॥ఆసగదా॥) యెనసి లోనికిఁ బోక యెప్పుడు వత్తువో యంట కనురెప్ప వెట్ట కట్టె కాచుకుండితి నినువుచంద్రోదయము నీ పంజువెలుఁ గంటాఁ గని యంతలోఁ దెలిసి కళవళించితిని (॥ఆసగదా॥) చీమ చిటు కననీక చెలి పిలుతువో యంటా ఆముకొని దిక్కులెల్లా నాలకించితి ప్రేమపు నెమలికూఁత పిలిచేవు నీ వంటా దీమసాన నూఁకొని తెలిసి లోఁగితిని (॥ఆసగదా॥) మనసు నీవద్ది కంపి మాఁకువలెఁ బానుపుపై చెనకె శ్రీవేంకటేశ చెంది కూడితి తనివోక నా నీడ తగు నీచెక్కునఁ జూచి కొనగోర నూఁదిపట్టి గొబ్బునఁ దీసితిని English(||pallavi||) āsagadā mosabuchchĕ nayyā na nniṁtagānu vāsula valabulane valalam̐ jikkidini (||āsagadā||) yĕnasi lonigim̐ boga yĕppuḍu vattuvo yaṁṭa kanurĕppa vĕṭṭa kaṭṭĕ kāsuguṁḍidi ninuvusaṁdrodayamu nī paṁjuvĕlum̐ gaṁṭām̐ gani yaṁtalom̐ dĕlisi kaḽavaḽiṁchidini (||āsagadā||) sīma siḍu kananīga sĕli piluduvo yaṁṭā āmugŏni dikkulĕllā nālagiṁchidi premabu nĕmaligūm̐ta pilisevu nī vaṁṭā dīmasāna nūm̐kŏni tĕlisi lom̐gidini (||āsagadā||) manasu nīvaddi kaṁpi mām̐kuvalĕm̐ bānububai sĕnagĕ śhrīveṁkaḍeśha sĕṁdi kūḍidi tanivoga nā nīḍa tagu nīsĕkkunam̐ jūsi kŏnagora nūm̐dibaṭṭi gŏbbunam̐ dīsidini