Title (Indic)ఆసతో నన్నిమాఁటలు నాడితి నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆసతో నన్నిమాఁటలు నాడితి నిన్ను మూసిన ముత్తెమువలె మొక్కే నే నీకును (॥ఆస॥) బత్తితో నాడినమాఁట భావములు గరఁగించు కొత్తమాఁట వేడుకతోఁ గొసిరింపించు పొత్తులమాఁట కమ్మటిఁ బూని యడిగింపించు యిత్తల నామాఁటలు నీకెటువలె నుండెనో (॥ఆస॥) లాలనతోడిమాఁట లాచి పెనఁగింపించు నాలిమాట సెలవుల నవ్వింపించు మేలుమీఁదిమాఁటలు సమేళములు పెడరేఁచు యీలీల నామాఁటలు నీ కెటువలె నుండెనో (॥ఆస॥) ఇచ్చకమయినమాఁట ఇయ్యకోలుగాఁ జేసు మచ్చికగలుగుమాఁట మన్నింపించు అచ్చముగ నన్నేలితి వన్నిటా శ్రీవేంకటేశ యిచ్చయిన నామాఁటలు నీ కెటువలె నుండెనో English(||pallavi||) āsado nannimām̐ṭalu nāḍidi ninnu mūsina muttĕmuvalĕ mŏkke ne nīgunu (||āsa||) battido nāḍinamām̐ṭa bhāvamulu garam̐giṁchu kŏttamām̐ṭa veḍugadom̐ gŏsiriṁpiṁchu pŏttulamām̐ṭa kammaḍim̐ būni yaḍigiṁpiṁchu yittala nāmām̐ṭalu nīgĕḍuvalĕ nuṁḍĕno (||āsa||) lālanadoḍimām̐ṭa lāsi pĕnam̐giṁpiṁchu nālimāḍa sĕlavula navviṁpiṁchu melumīm̐dimām̐ṭalu sameḽamulu pĕḍarem̐su yīlīla nāmām̐ṭalu nī kĕḍuvalĕ nuṁḍĕno (||āsa||) ichchagamayinamām̐ṭa iyyagolugām̐ jesu machchigagalugumām̐ṭa manniṁpiṁchu achchamuga nannelidi vanniḍā śhrīveṁkaḍeśha yichchayina nāmām̐ṭalu nī kĕḍuvalĕ nuṁḍĕno