Title (Indic)ఆసతి మరఁగువాఁడ వన్నిటా నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆసతి మరఁగువాఁడ వన్నిటా నీవు మోసపోక నీవాపె ముద్దుల దేరాదా (॥ఆస॥) చేపట్టేవు నీకు నేఁ జెప్పినట్టు సేసేఁగాని ఆపె నడిగి రారాదా ఆమాటే దూపిలేవు నీచేఁతకుఁ దొరలకుందాననంటా చాపలాన నీవాపెను సమ్మతింపించరాదా (॥ఆస॥) పైకొనేవు నీకు నేఁ బనులుసేసేఁగాని ఆకాంతఁ దోడితేరాదా అప్పణగాను కాకరివై దూరేవు గక్కన విడెమీనంటా పోకులఁబోక నీవాపెఁ బూఁటవెట్టరాదా (॥ఆస॥) పూవులవేసేవు నీకు పొందైవుండేఁగాని ఆవనితఁ గూడరాదా అప్పుడే ముందే శ్రీ వెంకటేశ నన్నుఁ జెందితివి ఆలనంటా కావించే(చా?) పెకుఁ జెల్లెలిఁగా నన్నుఁ జేయరాదా English(||pallavi||) āsadi maram̐guvām̐ḍa vanniḍā nīvu mosaboga nīvābĕ muddula derādā (||āsa||) sebaṭṭevu nīgu nem̐ jĕppinaṭṭu sesem̐gāni ābĕ naḍigi rārādā āmāḍe dūbilevu nīsem̐tagum̐ dŏralaguṁdānanaṁṭā sābalāna nīvābĕnu sammadiṁpiṁcharādā (||āsa||) paigŏnevu nīgu nem̐ banulusesem̐gāni āgāṁtam̐ doḍiderādā appaṇagānu kāgarivai dūrevu gakkana viḍĕmīnaṁṭā pogulam̐boga nīvābĕm̐ būm̐ṭavĕṭṭarādā (||āsa||) pūvulavesevu nīgu pŏṁdaivuṁḍem̐gāni āvanidam̐ gūḍarādā appuḍe muṁde śhrī vĕṁkaḍeśha nannum̐ jĕṁdidivi ālanaṁṭā kāviṁche(sā?) pĕgum̐ jĕllĕlim̐gā nannum̐ jeyarādā