Title (Indic)ఆసపడుదురు నీకు నంగనలు గనుఁగొని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆసపడుదురు నీకు నంగనలు గనుఁగొని దోసముగా దందులకు దొరవైతేనేమి (॥ఆస॥) యెనలేని మోహమున నెవ్వతైనా సొలయును మనసిచ్చి యెవ్వతైనా మాటలాడును ననుపున నెవ్వతైనా నవ్వఁజూచు నీతోను వినయము సేయదంటా వెనఁ గోపించకుమీ (॥ఆస॥) దంటయైనది యొకతె తమకించు నీకుఁ గాను వొంటి నుండితే నొకతె యొడివట్టును అంటి చన్నులనే వొత్తు నండనేయుండి యొకతె ఇంటిలోనే మొక్కదంటా నెగ్గులు పట్టకుమీ (॥ఆస॥) బత్తిగలజవరాలు పైకొని చెనకును అత్తుకొన్న ముద్దరుల ఆయము లంటు ఇత్తల శ్రీవేంకటేశ యే నలమేలు మంగను సత్తుగా నీయాలనైతి సాదించెననకుమీ English(||pallavi||) āsabaḍuduru nīgu naṁganalu ganum̐gŏni dosamugā daṁdulagu dŏravaidenemi (||āsa||) yĕnaleni mohamuna nĕvvadainā sŏlayunu manasichchi yĕvvadainā māḍalāḍunu nanubuna nĕvvadainā navvam̐jūsu nīdonu vinayamu seyadaṁṭā vĕnam̐ gobiṁchagumī (||āsa||) daṁṭayainadi yŏgadĕ tamagiṁchu nīgum̐ gānu vŏṁṭi nuṁḍide nŏgadĕ yŏḍivaṭṭunu aṁṭi sannulane vŏttu naṁḍaneyuṁḍi yŏgadĕ iṁṭilone mŏkkadaṁṭā nĕggulu paṭṭagumī (||āsa||) battigalajavarālu paigŏni sĕnagunu attugŏnna muddarula āyamu laṁṭu ittala śhrīveṁkaḍeśha ye nalamelu maṁganu sattugā nīyālanaidi sādiṁchĕnanagumī